నన్ను చంపాలని చూస్తుంది: నరేశ్
సినీ నటుడు నరేశ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె భార్యపై నరేశ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రమ్య రఘుపతితో తనకు ప్రాణహాని ఉందన్నారు. “ నా ఆస్తి కాజేేందుకు ప్రయత్నించింది. ఒప్పుకోకపోవటంతో నన్ను చంపించేందుకు కుట్ర పన్నింది. నన్ను హత్య చేయించేందుకు సుపారీ కూడా ఇచ్చింది. చంపేస్తారనే భయంతో ఎక్కడి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాను. పవిత్ర నేను కలిసి ఉంటాం. ఎవ్వరికీ భయపడేది లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.