• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాలస్తీనా పౌరుల మృతిపై మోదీ సంతాపం

    పాలస్తీనియన్‌ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌తో భారత్ ప్రధాని మోదీ మాట్లాడారు. గాజా ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో పౌరుల ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల సంతాపాన్ని తెలిపారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు భారత్‌ మానవతా సాయాన్ని పంపిస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. గాజాలో ఉగ్రవాదం, హింస, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై ఆందోళనను వ్యక్తం చేశారు ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటిస్తామని మోదీ పేర్కొన్నారు. .

    పాలస్తీనా పౌరుల మృతిపై మోదీ సంతాపం

    గాజా స్ట్రిప్‌లో తీవ్రంగా ఫుడ్ కొరత

    గాజా స్ట్రిప్ ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల కొరత సైతం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంపై గత గురువారం జరిగిన రాకెట్ల దాడిలో వెయ్యి మందకి పైగా పౌరులు మృతి చెందారు. యుద్ధ వాతావరణం కారణంగా అక్కడి ప్రజలు చాలా మంది ఇజ్రాయెల్, ఈజిప్ట్ భూ భాగంలోకి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు వారిని నిలువరించడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

    ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు

    ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. వివాదాస్పద గాాజా స్ట్రిప్ ప్రాంతంలో పాలస్తీనా మిలిటెంట్లు ఈ రోజు తెల్లవారుజామున రాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్‌‌పై మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించామని, 5వేల రాకెట్లతో దాడులు చేశామని చెబుతూ హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ ఓ వీడియో విడుదల చేశారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమైంది.