కేసీఆర్ సభకు నేను రాను; బీహార్ సీఎం నితీశ్
తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించే సచివాలయ ప్రారంభోత్సవ సభకు తాను రాలేనని బిహార్ సీఎం నితీశ్ కుమార్ తేల్చి చెప్పారు. తనకు చాలా పనులు ఉన్నాయని.. అందుకు సభకు హాజరు కాలేనని పేర్కొన్నారు. తన తరఫున తేజస్వీ యాదవ్ హాజరవుతారని చెప్పారు. కేసీఆర్ సభకు హాజరైనంత మాత్రానా.. కాంగ్రెస్ తమకున్న భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదని నితీశ్ పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో నూతన సెక్రటేరియేట్ ప్రారంభించనున్నారు.