• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ప్రజలు చనిపోతున్నారు.. చర్చలు జరపండి’

    రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్దంలో ఏ దేశానికి విజయం దక్కదన్నారు. యుద్ధం కాణంగా ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధం ఫలితంపై ప్రతిష్టంభన నెలకొంది. ఎవరూ పూర్తి స్థాయిలో పుంజుకోలేక పోతున్నారు. కాబట్టి ఇరు దేశాలు చర్చలు జరుపుకొని ఓ నిర్ణయానికి రండి’. అని అలెగ్జాండర్ పిలుపునిచ్చారు.

    మధ్యవర్తిత్వానికి సిద్ధమే: పుతిన్

    ఇజ్రాయెల్‌- హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాలు ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు, మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. పౌరులపై ఆయుధాలను ఉపయోగించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని చెప్పారు. అమాయకుల మరణాలు ఆమోదయోగ్యం కాదని పుతిన్ వ్యాఖ్యానించారు.

    ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 50 మంది మృతి

    రష్యా క్లిపణి దాడిలో ఉక్రెయిన్‌లో 50 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఖర్కివ్‌ రీజియన్‌ కుపియాన్స్క్‌ జిల్లాలోని గ్రోజా గ్రామంపై ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రష్యా క్షిపణులతో విరుచుకపడింది. దాడి జరిగిన ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మరోపైపు ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ బలోపేతానికి సాయం చేయాలని మిత్రదేశాలను అభ్యర్థించింది.

    రష్యా ఎయిర్‌పోర్టుపై డ్రోన్ల దాడి

    రష్యా వాయువ్య ప్రాంతంలోని ఎయిర్‌పోర్టుపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో నాలుగు విమానాలు ద్వంసమయ్యాయి. డ్రోన్ల దాడిలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయని రష్యా మీడియా పేర్కొంది. ఈ ఘటనలో నాలుగు ఇల్యూషిన్-76 విమానాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న పోస్కోవ్ ఎయిర్‌పోర్టుపై ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు పేర్కొన్నారు. దాడి ఘటనపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. There has been an attack on the Airport Pskov, a Russian … Read more