• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • శ్రీవారికి కాసుల వర్షం; ఎన్ని కోట్లంటే?

  తిరుమల శ్రీవారికి హుండీకి జనవరి నెలలో కాసుల వర్షం కురిసింది. ఆ నెలలో మొత్తం 20,58,242 మంది భక్తులు వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 122.68 కోట్లు హుండీ కానుకలు సమర్పించారు. జనవరి 2 ఏకంగా ఆలయ చరిత్రలోనే అత్యధికంగా రూ.7.68 కోట్ల కానుకలు వేశారు. కాగా గత 10 నెలలుగా నెలకు రూ.100 కోట్ల హుండీ ఆదాయం వస్తోంది. హుండీ ఆదాయంతో పాటు లడ్డూ విక్రయాలు, కళ్యాణకట్ట, కళ్యాణమండపాల ద్వారా కూడా టీటీడీకీ భారీ ఆదాయం వస్తోంది.

  అమెరికాలో చరిత్ర సృష్టించిన భారత మహిళ

  భారత సంతతికి చెందిన మోనికా సింగ్ అమెరికాలో అరుదైన ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టు జడ్జిగా ఆమె ప్రమాణస్వీకారం చేసింది. దీంతో అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. కాగా మోనికా హ్యూస్టన్‌లో 20 ఏళ్ల పాటు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. జాతీయ స్థాయి కేసులను కూడా ఆమె వాదించారు. కాగా అమెరికాలో 5 లక్షల మంది సిక్కులు ఉండగా.. ఒక్క హ్యూస్టన్‌లోనే 20 వేల మంది ఉన్నట్లు అంచనా.

  బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్

  భారత యంగ్ గన్ ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఘనత సాధించాడు. తన పదునైన బౌలింగ్‌తో యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు. శ్రీలంక జరిగిన తొలి టీ20లో 155.3 కి.మీ వేగంతో బంతి విసిరి కెప్టెన్ షనకను పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ తరఫున అత్యంత వేగంగా బంతి విసిరిన బౌలర్‌గా ఉమ్రాన్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు జస్ప్రీత్ బుమ్రా(153.3) పేరిట ఉండేది. కాగా ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

  యూపీఐ పేమెంట్స్‌లో రికార్డు

  గత నెలలో ఆన్‌లైన పేమెంట్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్ వంటి యూపీఐ ద్వారా డిసెంబర్ నెలలో రూ.12.82 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. 782 కోట్ల ట్రాన్సాక్షన్లు దాటాయి. కాగా యూపీఐ పేమెంట్స్ సులభంగా చేసుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్లకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఇందుకు సంబంధించిన యాప్స్ చాలానే ఉన్నాయి. దీంతో ప్రజలు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అందరూ వాడుతున్నారు.

  రూ.100 కోట్ల క్లబ్‌లో ‘ధమాకా’

  మాస్ మాహరాజా రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై రెండు వారాలు అవుతున్నా కలెక్షన్ల సునామీ ఆగడం లేదు. ఈ సినిమా మొదటి రోజు కన్నా 10వ రోజు ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టింది. 11వరోజు రూ.94కోట్ల గ్రాస్ రాబట్టింది. 12వ రోజు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రాన్నిడైరెక్టర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. రవితేజ యాక్షన్, శ్రీలీల అందం, అభినయం, డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

  ప్రభాస్ దెబ్బకు ‘అన్‌స్టాపబుల్’ రికార్డు మోత

  నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోలో ప్రభాస్ ఎపిసోడ్ రికార్డు నెలకొల్పింది. ఈ ఎపిసోడ్ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు ఆహా తెలిపింది. ఈ ఎపిసోడ్ మంచి రెస్పాన్స్ వచ్చినట్లు పేర్కొంది. కాగా ఒక్కసారిగా ఆహా యాప్‌నకు వీక్షకులు పోటెత్తడంతో ప్రభాస్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆహా తన సాంకేతిక సమస్యలు పరిష్కరించుకుని తిరిగి స్ట్రీమింగ్ చేసింది. వచ్చే శుక్రవారం రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

  68 బంతులకే 348 పరుగులు

  ఢిల్లీకి చెందిన తన్మయ్ సింగ్ క్లబ్ క్రికెట్‌లో భీభత్సం సృష్టించాడు. కేవలం 132 బంతుల్లోనే 401 పరుగులు (క్వాడ్రపుల్ సెంచరీ) బాది చరిత్ర సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 30 ఫోర్లు, 38 సిక్సర్లు ఉన్నాయి. 348 పరుగులు బౌండరీల రూపంలోనే రావడం విశేషం. అండర్ 14 క్రికెట్‌లో భాగంగా ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై తన్మయ్ ఈ ఘనత సాధించాడు. ఇతడి ధాటికి తన జట్టు దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ నిర్ణీత 50 ఓవర్లలో 656 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు 193 పరుగులకే కుప్పకూలింది.

  ఫిఫా దెబ్బకు గూగుల్ నయా రికార్డ్

  ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సరికొత్త రికార్డు సృష్టించింది. తన 25 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక సెర్చ్ ట్రాఫిక్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించాడు. ‘‘యావత్ ప్రపంచం ఒకే ఒక్క దాని కోసం వెతికినట్లు అనిపిస్తుంది’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ఫిఫా, మెస్సీ, అర్జెంటీనా, ఎంబాపే పేర్లు గూగుల్‌లో తెగ వెతికారు. భారతీయులు కూడా ఫిఫా ప్రపంచకప్ గురించి గూగుల్‌లో తెగ వెతికి మూడో స్థానంలో నిలిచారు.

  శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు

  భారత టాపార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ గడ్డపై అరుదైన రికార్డు నెలకొల్పాడు. మొదటి వన్డేలో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా ఓ రికార్డుతో మెరిశాడు. కివీస్ గడ్డపై వన్డేల్లో వరుసగా నాలుగు లేదా ఎక్కువసార్లు అర్ధసెంచరీలు సాధించిన రెండో విదేశీ ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా అతడి కంటే ముందున్నాడు. కాగా గత 8 వన్డేల్లో భారత్ తరఫున అయ్యర్ 5 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించి ప్రపంచకప్ రేసులో నిలుస్తున్నాడు.

  దిగ్గజాల సరసన గబ్బర్

  న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ కెప్టెన్ శిఖర్ ధవన్ అర్థసెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ధవన్ మరో మైలురాయిని చేరుకున్నాడు. ధవన్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు లిస్ట్ ఏ క్రికెట్‌లో 12 వేల పరుగులు చేసిన ఏడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ప్రస్తుతం గబ్బర్ 12,025 పరుగులతో కొనసాగుతున్నాడు. ధవన్ కంటే ముందు సచిన్ (21,999), గంగూలీ (15,622), ద్రావిడ్ (15,271), కోహ్లీ (13,786), ధోనీ (13,353), యువరాజ్ సింగ్ (12,633) ఉన్నారు.