• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోని నుంచి అవి నేర్చుకోవాలి: గైక్వాడ్

    ఆసియా క్రీడల్లో భారత జట్టుకు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహిస్తున్నాడు. తొలి మ్యాచ్ రేపు నేపాల్‌తో జరగనుంది. ఈ నేపథ్యంలో గైక్వాడ్‌ స్పందించాడు. ‘ధోనీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన స్టైల్‌, ఆయన వ్యక్తిత్వం విభిన్నం. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలి? మ్యాచ్‌ సమయంలో కొందరు ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాలి? వంటివి ఆయన నుంచి నేర్చుకోవాలి. అయితే, నా స్టైల్‌లోనే కెప్టెన్సీని నిర్వర్తించాలని కోరుకుంటున్నా. ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చేలా వారికి పూర్తి స్వేచ్ఛనిస్తా’ అని గైక్వాడ్‌ చెప్పాడు.

    గోల్డ్ మెడలే లక్ష్యం: రుతురాజ్

    ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి పోడియం వద్ద జాతీయ గీతాన్ని ఆలపించడమే తన లక్ష్యమని రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు. భారత్ క్రికెట్ జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ క్రీడలకు జట్టు చైనా వెళ్లనుంది. ఈ మేరకు కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు క్రీడలు జరగనున్నాయి. మరోవైపు, సెప్టెంబర్ 28 నుంచే వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా ఇందులో ఉన్నాడు. … Read more

    రుతురాజ్ అద్భుత ఫీల్డింగ్ చూశారా?

    [VIDEO:](url) సీఎస్కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఫీల్డింగ్ ఇప్పుడు నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో రుతురాజ్ ఓ బౌండరీని ఆపిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. 19వ ఓవర్లో షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా బంతిని స్కూప్ చేశాడు. దీంతో బాల్ బౌండరీ వెళ్తుందని అంతా ఊహించారు. కానీ, డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి దూసుకుంటూ వచ్చిన రుతురాజ్ బాల్‌ని ఆపాడు. కీలక సమయంలో 3 పరుగులు సేవ్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. … Read more

    ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదిన రుతురాజ్‌

    టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు బాది పెను విధ్వంసం సృష్టించాడు. నోబాల్‌తో సహా వరుసగా 7 సిక్స్‌లు కొట్టి ప్రపంచ [రికార్డు](url) నమోదు చేశాడు. గైక్వాడ్ విజృంభణతో యువరాజ్ సింగ్ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. దేశవాళి టీర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మహరాష్ట్ర తరఫున రుతురాజ్ ఈ రికార్డు సాదించాడు. యూపీతో జరిగిన మ్యాచ్‌లో శివ సింగ్‌ను ఉతికారేసి 7 సిక్సర్లతో 43 పరుగులు రాబట్టాడు. మొత్తంగా గైక్వాడ్ 159 బంతుల్లో 220 పరుగులు చేశాడు. ROCKET … Read more