• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • శ్రీవారి సేవలో షారుక్ ఖాన్

  తిరుమల శ్రీవారిని బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన బాలీవుడ్ నటుడు ఈ ఉదయం స్వామివారి సుప్రభాతసేవలో షారుక్ పాల్గొన్నారు. షారుక్‌తో పాటు నటి నయనతార సైతం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు. రేపు షారుక్- నయన్ జంటగా నటించిన జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈక్రమంలో చిత్రబృదం స్వామివారిని దర్శించుకున్నారు. #WATCH | Andhra Pradesh: Actor Shah Rukh Khan arrives in Tirupati He will visit … Read more

  అదిరిపోయిన ‘జవాన్‌’ టీజర్‌

  బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘జవాన్‌’ మూవీ టీజర్‌ తాజాగా విడులైంది. టీజర్ హై లెవల్లో ఉంది. ఇందులో కొంతమంది అమ్మాయిలతో షారుఖ్ ఫైట్‌ చేస్తూ కనిపించాడు. షారుక్‌ను ఆర్మీ ఆఫీసర్‌గా చూపించారు. చివర్లో షారుఖ్ గుండుతో కనపడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

  షారుఖ్‌కు యువతి బలవంతపు ముద్దు!

  బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు ఓ యువతి బలవంతంగా ముద్దు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షారుక్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో అ మహిళా అభిమాని షారుక్ వద్దకు చేరుకుని.. మిమ్మిల్ని ముద్దు పెట్టుకోవచ్చా.. అంటూ అడిగింది. సమాధానం చెప్పేలోగానే షారుఖ్ బుగ్గపై ఆమె ముద్దు పెట్టేసింది. ఊహించని పరిణామంతో ఆయన కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. Love for this man will never diminish because, this man has always … Read more

  సినిమా స్టార్ల ట్వీట్.. ప్రధాని రిప్లై

  సినీ సెలబ్రిటీలు రజినీకాంత్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నూతన పార్లమెంట్ భవనం విశిష్ఠతలను వివరిస్తూ వీరు తమ వాయిస్ ఓవర్ ఇచ్చి ట్వీట్ చేశారు. వీరికి మోదీ రిప్లై ఇచ్చారు. షారూక్ ట్వీట్‌కి స్పందిస్తూ అద్భుతంగా వర్ణించారన్నారు. ‘అద్భుతంగా వర్ణించారు. ప్రజాస్వామ్య పురోగతికి ఈ నూతన పార్లమెంట్ భవనం నిదర్శనం. సంప్రదాయం, ఆధునికతల మేళవింపు’ అని రిప్లై ఇచ్చారు. తలైవా రజినీకాంత్, అక్షయ్ కుమార్ ట్వీట్ చేసిన వీడియోను సైతం ప్రధాని రీట్వీట్ చేశారు. Beautifully expressed! … Read more

  బలూచిస్థాన్‌లో షారూక్ సైకత శిల్పం

  [VIDEO:](url) షారూక్ ఖాన్‌కి పాకిస్తాన్‌లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా షారూక్ సైకత శిల్పాన్ని బెలూచిస్థాన్‌లోని గడానీ బీచ్‌లో తీర్చిదిద్దారు. సమీర్ షౌకత్ నేతృత్వంలోని రషీదీ ఆర్టిస్ట్స్ గడాని ఆధ్వర్యంలో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. ‘మా బృందంతో కలిసి షారూక్ అతిపెద్ద స్కెచ్‌ని వేశాం’ అంటూ సమీర్ షౌకత్ ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. బీచ్‌లో ఏర్పాటు చేసిన ఈ స్కెచ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల పఠాన్ సినిమాతో షారూక్ భారీ … Read more

  నయనతార ఇంట్లో షారూక్ సందడి

  బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ చెన్నైలో సందడి చేశాడు. అట్లీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ‘జవాన్’ మూవీ చిత్రీకరణ కోసం తమిళనాడుకు వచ్చాడు. ఈ సినిమాలో షారూక్ సరసన నయనతార నటిస్తోంది. షూటింగ్ అనంతరం షారూక్ నయన్ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో తిరుగు పయనమవుతుండగా అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఎట్టకేలకు షారూక్ తన కారు వద్దకు చేరుకుని నయన్‌కు పెక్(చెంపపై ముద్దు) ఇచ్చాడు. నయనతార కూడా సెండ్ ఆఫ్ ఇస్తూ గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఈ [వీడియో](url)లు వైరల్ అవుతున్నాయి. [?]: … Read more

  ‘పఠాన్’ మూవీ; దివ్యాంగుడి సాహసం

  తన అభిమాన నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ మూవీని చూడటానికి ఓ దివ్యాంగుడు [సాహసం](url) చేశాడు. 150 కి.మీ ప్రయాణించి పొరుగు రాష్ట్రం వెళ్లి మరీ ఈ సినిమా చూశాడు. బిహార్‌లోని భాగల్పూర్‌కు చెందిన మహ్మద్ రుస్తుం షారుఖ్ అభిమాని. అతనికి చిన్నప్పుడే రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. దీంతో సొంతంగా అతడు నిలబడలేడు.. నడవలేడు. తన సొంతూర్లో ‘పఠాన్’ టికెట్లు దొరకలేదని తమ్ముడి సాయంతో పశ్చిమ బెంగాల్‌లో ని మాల్దా వెళ్లి.. అక్కడ సంసీర్ థియేటర్లో ‘పఠాన్’ మూవీ వీక్షించాడు. A … Read more

  యాక్షన్‌తో కుమ్మేసిన ‘పఠాన్’

  బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా, హాట్ హీరోయిన్ దీపికా పడుకొణె హీరోయిన్‌గా తెరకెక్కిన ‘పఠాన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీ చూసినట్లుగా ఉందనిపిస్తోంది.ఈ మూవీ హైఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా రూపొందించినట్లు తెలుస్తోంది. షారుఖ్, దీపికా ఇద్దరూ దేశం కోసం పని చేసే సైనికులుగా నటించారు. విలన్ పాత్రలో జాన్ అబ్రహాం నటించాడు. ఈ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  సల్మాన్ బర్త్‌డే పార్టీలో షారుఖ్

  బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ తమ శతృత్వం వీడి కలిసిపోయారు. డిసెంబర్ 27న సల్మాన్ తన 57వ పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకలకు షారుఖ్ ఖాన్, పూజా హెగ్డే, కార్తీక్ ఆర్యన్, సంగీతా బిజ్లానీ, టబు, సునీల్ శెట్టి హాజరయ్యారు. వేడుకల అనంతరం సల్మాన్, షారుఖ్ [ఆలింగనం](url) చేసుకున్నారు. దీనిపై వీరిద్దరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. కాగా షారుఖ్ నటించిన ‘పఠాన్’ మూవీలో సల్మాన్ గెస్ట్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. SALMAN KHAN | SHAHRUKH … Read more

  విమర్శకులకు షారుఖ్ స్ట్రాంగ్ కౌంటర్

  తనపై వస్తోన్న విమర్శలకు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నంత కాలం ప్రపంచం ఏమనుకున్నా డోంట్ కేర్. సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. సోషల్ మీడియా సంకుచిత దృష్టి కోణంతో చూస్తూ ఉంటుంది. ఎవరేమనుకున్నా ‘పఠాన్’ సినిమా రిలీజ్‌ను ఆపలేరు.’’ అంటూ షారుఖ్ ఘాటుగానే సమాధానమిచ్చాడు. కాగా షారుఖ్ నటించిన ‘పఠాన్’లోని బేషరమ్ సాంగ్‌లో హీరోయిన్ దీపిక పడుకొనే హాట్ హాట్‌గా నటించడంతో కొందరు విమర్శిస్తున్నారు.