• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీలంకకు ఐసీసీ షాక్

    శ్రీలంకకు ICC షాక్‌ ఇచ్చింది. ఆ దేశ క్రికెట్‌ సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఐసీసీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని ఐసీసీ పేర్కొంది. శ్రీలంక క్రికెట్‌ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డులో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సస్పెండ్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

    కుప్పకూలిన శ్రీలంక టాప్‌ ఆర్డర్

    ప్రపంచకప్‌ భాగంగా నేడు శ్రీలంకతో న్యూజిలాండ్ ఆఖరి లీగ్ మ్యాచ్‌ ఆడుతోంది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న శ్రీలంక తడబడుతోంది. ఇప్పటికే శ్రీలంక టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు మాత్రమే చేసింది. పాథుమ్ నిశాంక (2), కుశాల్ మెండిస్ (6), సదీరా సమరవిక్రమ (1), చరిత్ అసలంక (8) పరుగులు చేసిన ఔటయ్యారు.

    ‘మా దేశానికొస్తే అతడికి రాళ్ల దెబ్బలు తప్పవు’

    శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ‘టైమ్‌డ్‌ ఔట్’ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. బంగ్లా కెప్టెన్ షకిబ్ తీరుపై శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ మ్యాచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన సోదరుడు ట్రెవిస్ కూడా షకిబ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘గేమ్‌లో షకిబ్ క్రీడా స్ఫూర్తి, మానవీయ విలువలు కూడా పాటించకపోవడం దారుణం. షకిబ్‌ను శ్రీలంకలోకి రానివ్వకూడదు. ఒకవేళ అతడు అంతర్జాతీయ మ్యాచ్‌ లేదా ఎల్‌పీఎల్‌లో పాల్గొంటే మాత్రం రాళ్ల దెబ్బలకు సిద్ధంగా ఉండాలి’. అని ట్రెవిస్‌ పేర్కొన్నాడు.

    శ్రీలంక అత్యంత చెత్త రికార్డు

    వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో శ్రీలంక క్రికెట్‌ జట్టు అత్యంత చెత్త రికార్డును నమోదుచేసింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలింది.. దీంతో వరల్డ్‌కప్‌లో అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ చెత్త రికార్డు గతంలో బంగ్లాదేశ్‌ పేరిట ఉండేది. 2011 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 58 పరుగులకే ఆలౌటైంది. దీనికి ముందు 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 74 పరుగులు మాత్రమే చేసింది .

    AFG vs SL: అఫ్గాన్ సంచలన విజయం

    శ్రీలంకతో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ సంచలన విజయం నమోదుచేసింది. శ్రీలంకపై అఫ్గానిస్థాన్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆఫ్గాన్ 45.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రహమత్ షా (62), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (58), అజ్మతుల్లా (73) అర్ధ శతకాలు బాదడంతో సునాయసంగా విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మదుశంక 2, కాసున్ రజిత ఒక వికెట్ పడగొట్టారు.

    AFG vs SL: శ్రీలంక ఆలౌట్

    నేడు ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ ఓడి శ్రీలంక బ్యాటింగ్‌ చేసింది. శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లు ఓపెనర్ పాథుమ్ నిశాంక (46) దిముత్ కరుణరత్నె (15), కుశాల్ మెండిస్ (39), సదీర సమరవిక్రమార్క (36) ఎంజొలో మాథ్యూస్‌ (23), చరిత్ అసలంక (22), ధనంజయ డి సిల్వా (14) పరుగులు చేశారు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లు ఫజల్ హక్‌ ఫారూఖీ 4, ముజిబుర్ రహ్మన్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్‌ఖాన్‌ ఒక్కో వికెట్ … Read more

    ENG vs SL: శ్రీలంక ఘన విజయం

    ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఇంగ్లాండ్‌ శ్రీలంక జట్లు తలపడ్డాయి. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన శ్రీలంక 25.4 ఓవర్లలో 156 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 8 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. శ్రీలంక బ్యాటర్లు పాతుమ్ నిస్సాంక (77) కుశాల్ పెరీరా (4) కుసాల్ మెండిస్ (11) సదీర సమరవిక్రమ (65) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

    ENG vs SL: ఇంగ్లాండ్ ఆలౌట్

    ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఇంగ్లాండ్‌ శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు జానీ బెయిర్‌స్టో (30), డేవిడ్ మలన్ (28) జోరూట్ (3,) జోస్ బట్లర్ (8), లియామ్ లివింగ్‌స్టోన్ (1) ఘోరంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 2, ఏంజెలో మాథ్యూస్‌ 2, కాసున్ రజిత ఒక్కో వికెట్ పడగొట్టారు.

    SL vs NED: శ్రీలంకకు తొలి విజయం

    వన్డే వరల్డ్‌ కప్‌లో శ్రీలంక తొలి విజయం అందుకుంది. నేడు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నెదర్లాండ్స్ నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 48.2 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది. శ్రీలంక బ్యాటర్లు సదీర సమరవిక్రమ (91), పతుమ్‌ నిస్సంక (54), చరిత్‌ అసలంక (44) ధనంజయ డిసిల్వ (30)లు రాణించి జట్టుకు తొలి విజయాన్ని అందించారు.

    PAK vs SL: పాకిస్థాన్ విజయం

    శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్‌ ఛేదించింది. 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి పాక్ 345 లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (113) మహ్మద్ రిజ్వాన్ (131) పరుగులు చేసి జట్టుకు విజయం అదించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లు 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు చేసింది.