తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు: తమిళిసై
తెలంగాణ సర్కారు, గవర్నర్ తమిళిసై మధ్య వివాదం ముదురుతోంది. గణతంత్ర దినోత్సవానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కనీసం ప్రసంగ పాఠాన్ని కూడా ప్రభుత్వం పంపలేదని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. “ ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని యత్నించారు. ఓ శ్రేయోభిలాషి కోర్టుకు వెళ్లడంతో వేడుకలు నిర్వహించారు. రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశాను” అన్నారు.