ఖమ్మం కాంగ్రెస్ కీలక నేతల సీట్లు ఖరారు
ఖమ్మం అసెంబ్లీ సీటుపై కాంగ్రెస్ నేతల పంచాయితీ ఓ కొలిక్కి వచ్చింది. ఖమ్మం నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు అసెంబ్లీ స్థానాలపై ఓ స్పష్టత వచ్చింది. పాలేరు నుంచి పొంగులేటి, ఖమ్మం నుంచి తుమ్మలను బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. రాహుల్ గాంధీ సూచనతో ఈ ఇద్దరు నేతలు ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు సుముఖత చూపించారని సమాచారం. దీంతో ఈ ఇద్దరి నేతల సీట్ల కోసం జరుగుతున్న పంచాయితీ ముగిసింది.