శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్సుల్లోని 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 57,147 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 26,094 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం వెంకన్న హుండీ ఆదాయం 3.78 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.