గీతాగోవిందం సినిమాకు సీక్వెల్?
విజయ్ దేవరకొండ- రష్మిక మంధాన నటించిన గీతాగోవిందం సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలిసింది. లైగర్ ప్లాప్ తర్వాత విజయ్ ఖుషి సినిమా చేస్తున్నారు. అయితే సమంత అనారోగ్యం వల్ల ఈ మూవీ షూటింగ్ వాయిదాపడుతూ వస్తోంది. ఈక్రమంలో గీతగోవిందం డైరెక్టర్ పరుశురామ్ ఓ కథను వినిపించారని దానికి విజయ్ ఓకే చెప్పినట్లు తెలిసింది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటించనున్నట్లు టాక్. అయితే ఇది సీక్వెల్లా లేక కొత్త కథ అనేదానిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.