• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భారీ ధరకు ‘దళపతి67’ హక్కులు!

  ‘వరిసు’ సినిమా అనంతరం తమిళ హీరో విజయ్.. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నారు. దళపతి67గా దీన్ని పిలుస్తున్నారు. లోకి యునివర్స్‌లో భాగంగా ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఖైదీ, విక్రమ్ సినిమాల తర్వాత యునివర్స్‌లో భాగమయ్యే సినిమా ఇది. అయితే, ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. డిజిటల్, శాటిలైట్ హక్కులు కలిపి రూ.160కోట్ల ధర పలికినట్లు సమాచారం. మరోవైపు, దీన్ని మాస్, క్లాస్ అంశాలతో మేళవించి భారీ ఎత్తున తీయబోతున్నానని లోకేశ్ … Read more

  విక్రమ్ గర్జనకు 100 రోజులు

  థియేటర్లో, ఓటీటీలో రికార్డులు కొల్లగొట్టిన సినిమా ‘విక్రమ్’. ఈ మూవీ విడుదలై 100రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా కమల్ హాసన్ ఓ ట్వీట్ చేశారు. చిత్రాన్ని విజయం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ని తమ్ముడిగా అభివర్ణిస్తూ ధన్యావాదాలు చెప్పారు. వాయిస్ నోట్ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలపడం విశేషం. మ్యూజికల్ గా మెస్మరైజ్ చేసిన ఈ సినిమా.. థియేటర్ల వద్ద రూ.450కోట్లు కొల్లగొట్టింది. ఇందులో మీకు నచ్చిన డైలాగ్/సీన్ ఏంటో చెప్పండి. #100DaysofVikram #VikramRoaringSuccess pic.twitter.com/7SjZIpTB6M — Kamal … Read more

  ఓటీటీలోనూ సత్తా చాటుతున్న ‘విక్రమ్’

  కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో లోకేష్ కానగరాజ్ తెరకెక్కించిన మూవీ ‘విక్రమ్’. థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ మూవీ సుమారు రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డు సృష్టించింది. హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ వ్యూయర్ షిప్ సాధించిన మూవీగా నిలిచి సత్తా చాటింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది విక్రమ్ మూవీ.

  ఓటీటీలో దూసుకెళ్తున్న ‘విక్ర‌మ్‌’

  క‌మ‌ల్ హాస‌న్, ఫ‌హాద్ ఫాజిల్, విజ‌య్ సేతుప‌తి క‌లిసి న‌టించిన ‘విక్ర‌మ్’ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. లోకేశ్ క‌న‌గ‌రాజ్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జులై 8 నుంచి మూవీ ప్ర‌ముఖ ఓటీటీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్క‌డ కూడా విక్ర‌మ్ కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింద‌ని హాట్‌స్టార్ తెలిపింది. ఇంత‌కు ముందు ఉన్న అత్య‌ధిక స్ట్రీమింగ్ టైమ్‌ను అధిగ‌మించి విక్ర‌మ్ దూసుకెళ్తుంది. అదేవిధంగా అన్ని భాష‌ల్లో క‌లిపి బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ సాధించింద‌ని వెల్ల‌డించింది. దీనిపై స్పందించిన … Read more

  ‘విక్ర‌మ్’ ఓటీటీ స్ట్రీమింగ్ స్టార్ట్‌

  క‌మ‌ల్ హాస‌న్, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ ముగ్గురు స్టార్ హీరోలు క‌లిసి న‌టించిన ‘విక్ర‌మ్’ మూవీ ఈ ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ములేపిన సంగ‌తి తెలిసిందే. అయితే నేటి నుంచి విక్ర‌మ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభ‌మైంది. హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో జులై 8 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభ‌మైంది. మ‌రి ఓటీటీలో మూవీ ఇంకెన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీకి, అనిరుద్ సంగీతం అందించాడు.

  క‌మ‌ల్‌హాస‌న్‌కు ప‌దేళ్ల లోటును తీర్చేసిన విక్ర‌మ్

  గ‌త ప‌దేళ్లుగా స‌రైన హిట్ లేక నిరాశ‌లో ఉన్న‌ లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్‌కు విక్ర‌మ్ ఆ లోటును తీర్చింది. త‌మిళంలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. దీంతో పాటు తెలుగు, హిందీలో కూడా సినిమాకు క‌లెక్ష‌న్ల‌ వర్షం కురుస్తుంది. ప్ర‌స్తుతం దాదాపు రూ.400 కోట్ల‌కు చేరువ‌లో ఉంది. ఈ క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవకాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు ఫ‌హాద్ ఫాజిల్, విజ‌య్ సేతుప‌తికి కీల‌క పాత్ర‌లు ఇవ్వ‌డం, సూర్య గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ రిపీటెడ్‌గా ఈ సినిమాను … Read more

  ఓటీటీలో ‘విక్ర‌మ్’ స్ట్రీమింగ్ అప్పుడే ..!

  క‌మల్ హాస‌న్, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ ముగ్గురు స్టార్ హీరోల‌తో లోకేశ్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన చిత్రం విక్ర‌మ్. జూన్ 2న విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. ముగ్గురు హీరోల ఫ్యాన్స్‌తో పాటు సూర్య ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా ఓటీటీలోకి వ‌స్తుందా అని వేచి చూస్తున్నారు. తాజాగా విక్ర‌మ్ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఒక వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. దీని ఓటీటీ హ‌క్కుల‌ను హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే జులై 8 నుంచి … Read more

  KGF-2ను వెనక్కి నెట్టిన కమల్ హాసన్ ‘విక్రమ్’

  కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాసిల్, సూర్య ప్రధాన పాత్రల్లో లోకేష్ కానగరాజ్ తెరకెక్కించిన మూవీ ‘విక్రమ్’. జూన్ 3న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన అన్ని చోట్ల సూపర్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం తమిళనాడులో యష్ ‘KGF 2’ వసూళ్లను దాటేసింది. కేవలం 10 రోజుల్లోనే రూ.250 కోట్లకు పైగా షేర్స్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ లాంగ్ రన్‌లో మరింతగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

  ఖైదీ 2లో అర్జున్ దాస్ పాత్రపై డైరెక్టర్ క్లారిటీ

  బ్లాక్‌ బస్టర్ విక్రమ్‌ను అందించిన తర్వాత, కోలీవుడ్ మార్కెట్‌లో లోకేష్ కనగరాజ్‌పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే విక్రమ్ సినిమా చూసిన వారందరూ కానగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌ను మెచ్చుకుంటున్నారు. అయితే తాజాగా అతను నిర్వహించిన ట్విట్టర్ Q అండ్ Aలో అర్జున్ దాస్ పాత్ర గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఖైదీల్లో మృతి చెందిన అర్జున్ దాస్ ఎలా బతికాడని, విక్రమ్‌లో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన డైరెక్టర్.. అతను చనిపోలేదని, కానీ గాయాలతో బయటపడ్డాడని పేర్కొన్నాడు. దీని గురించి వివరాలను … Read more

  విక్రమ్ దర్శకుడు ‘ది లోకేశ్ కనగరాజ్’ సినిమేటిక్ యూనివర్స్

  లోకేశ్ కనగరాజ్..! గుర్తుపెట్టుకోండి. ఈ పేరు ఇండియన్ సనిమాలో తనకంటూ ఓ పేజీ రాసుకుంటుంది. ‘గన్స్, డ్రగ్స్, బిర్యానీ, వన్ నైట్ స్టోరీ’ స్టైల్ తో ‘ఖైదీ’ సినిమా చూసినపుడే ఎంతోమంది లోకేశ్ కనగరాజ్ కు అభిమానులయ్యారు. ఒకేరాత్రిలో అద్భుతమైన కథని అదిరిపోయే స్క్రీన్ ప్లేతో లోకేశ్ తెరకెక్కించిన విధానం సినిమా మేకింగ్ స్థాయిని పెంచేలా ఉంటుంది. ఇప్పుడు ‘విక్రమ్’ చూశాక ఎంతో మంది అతడికి డైహార్డ్ ఫ్యాన్స్ అయ్యారు. విక్రమ్, ఖైదీని లింక్ చేస్తూ ఓ సినిమేటిక్ యూనివర్స్ కు లోకేశ్ కనగరాజ్ … Read more