• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • విక్రమ్ దర్శకుడు ‘ది లోకేశ్ కనగరాజ్’ సినిమేటిక్ యూనివర్స్

  లోకేశ్ కనగరాజ్..! గుర్తుపెట్టుకోండి. ఈ పేరు ఇండియన్ సనిమాలో తనకంటూ ఓ పేజీ రాసుకుంటుంది. ‘గన్స్, డ్రగ్స్, బిర్యానీ, వన్ నైట్ స్టోరీ’ స్టైల్ తో ‘ఖైదీ’ సినిమా చూసినపుడే ఎంతోమంది లోకేశ్ కనగరాజ్ కు అభిమానులయ్యారు. ఒకేరాత్రిలో అద్భుతమైన కథని అదిరిపోయే స్క్రీన్ ప్లేతో లోకేశ్ తెరకెక్కించిన విధానం సినిమా మేకింగ్ స్థాయిని పెంచేలా ఉంటుంది. ఇప్పుడు ‘విక్రమ్’ చూశాక ఎంతో మంది అతడికి డైహార్డ్ ఫ్యాన్స్ అయ్యారు. విక్రమ్, ఖైదీని లింక్ చేస్తూ ఓ సినిమేటిక్ యూనివర్స్ కు లోకేశ్ కనగరాజ్ ప్రాణం పోశాడు. ఇప్పటివరకూ భారత సినీ చరిత్రలో లేని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు.

  అసలేంటీ సినిమేటిక్ యూనివర్స్?

  మన దగ్గర ఒక పెద్ద కథ ఉన్నపుడు, అందులోని ఒక్కో పాత్ర ఒక్కో అద్భుతం అయినపుడు, ఒక్క సినిమాగానో లేక ఒక సినిమాకే ప్రీక్వెల్, సీక్వెల్ అంటూ చెప్పలేకపోయినపుడు ఈ సినిమేటిక్ యూనివర్స్ పుట్టుకొస్తుంది. హాలివుడ్ లో మార్వెల్ సినిమేటిక్ యూనివర్స్ ఇందుకు చక్కటి ఉదాహరణ. ఐరన్ మ్యాన్, థోర్, హల్క్, స్పైడర్ మ్యాన్ ఇలా ఎవరికి వారు పోరాడుతుంటారు. కానీ అందరూ ఒకే ప్రపంచంలో ఉంటారు. ఒక బలమైన అంశం వారందరినీ కలుపుతుంది. లోకేశ్ కనగరాజ్ కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. 

  మరి ఖైదీ, విక్రమ్ కు సంబంధమేంటి?

   ఖైదీ సినిమాలో డిల్లీ అనే ఓ ఖైదీ జైలు నుంచి విడుదలై అనాథాశ్రమంలో ఉన్న తన కూతురిని కలుసుకునేందుకు వెళ్తుంటాడు. అయితే అదే రాత్రి ఓ కీలక సంఘటన అతడి జీవితంలో చోటు చేసుకుంటుంది. కోట్ల విలువైన ఓ డ్రగ్ కంటెయినర్ ను కాపాడాల్సిన బాధ్యత అతడి భుజాలపై పడుతుంది. పోలీస్ పాత్రలో ఉన్నబిజాయ్ అందుకు కారణమవుతాడు.ఓ అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్న అధికారి వల్ల  ఆ డ్రగ్స్ పోలీసుల చేతుల్లోకి వెళ్తాయి. అయితే పోలీసుల్లో ఉన్న కోవర్ట్ వల్ల ఆ డ్రగ్ కంటెయినర్ మళ్లీ ప్రమాదంలో పడుతుంది. ఇక్కడే డిల్లీ తన ప్రాణాలకు తెగించి డ్రగ్స్ గ్యాంగ్ ను తరిమికొడతాడు. ఆ తర్వాత అక్కడినుంచి తన కూతుర్ని తీసుకుని వెళ్లిపోతాడు. ఇక్కడితో ఖైదీ ముగుస్తుంది.  అయితే మరి విక్రమ్ ఎవరు? విక్రమ్ సినిమా కూడా ఆ డ్రగ్స్ చుట్టూనే తిరుగుతుంది. డ్రగ్స్ ను పట్టుకునేందుకు కారణమైన పోలీసు అధికారి తండ్రే విక్రమ్. ఆయనొక ఆర్మీ మాజీ బ్లాక్ స్క్వాడ్ కెప్టెన్. కుమారుడి చావుతో రగిలిపోతూ ఆ డ్రగ్స్ ఎట్టిపరిస్థితుల్లో దుర్మార్గుల చేతిలోకి వెళ్లకూడదని నిర్ణయించుకుంటాడు. ‘ఖైదీ’లో ఉండే పోలీసు బిజోయ్ విక్రమ్ తో కలిసి పనిచేస్తాడు. ఇందులో మరో పాత్ర ఉంటుంది. విక్రమ్ ను పట్టుకునేందుకు వచ్చే ఫాహద్ ఫాజిల్. ఇతడు కూడా బ్లాక్ స్క్వాడ్ కు సంబంధించినవాడే. ఈ సినిమాలో తన భార్యను కోల్పోతాడు. విజయ్ సేతుపతి డ్రగ్స్ గ్యాంగ్ కు చెందినవాడే ఆ కంటెయినర్ జాడ కోసం పోరాడుతుంటాడు. వీరందరికీ బాస్, తన ఎంట్రీతో థియేటర్లను షేక్ చేసిన క్యారెక్టర్ సూర్య నటించిన ‘రోలెక్స్’. రోలెక్స్ ఎంట్రీతో సినిమా ముగుస్తుంది.

  లోకేశ్  సినిమేటిక్ యూనివర్స్ లో ఇంకెన్ని సినిమాలుంటాయి?

  నిజం చెప్పాలంటే ఎన్నైనా ఉండొచ్చు. ఖైదీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే లోకేశ్ కనగరాజ్ ప్రకటించాడు. విక్రమ్ కు కూడా సీక్వెల్ కొనసాగుతుందని మనకు సినిమా చూస్తే తెలుస్తుంది. అలాగే ‘విక్రమ్’ సినిమా చివర్లో ఒక గ్యాంగ్ కార్తీ కోసం, ఇంకో గ్యాంగ్ ఫాహద్ ఫాజిల్ కోసం మరో గ్యాంగ్ కమల హాసన్ కోసం వెళ్తుంది. ఈ మూడు సినిమాలు కూడా వేర్వేరుగా తీయొచ్చు. అలాగే క్లైమాక్స్ లో సూర్య 25 ఏళ్లు కష్టపడి తాను ఈ సామ్రాజ్యం స్థాపించానని చెబుతాడు. ఆ ప్రయాణాన్ని సినిమా చేయొచ్చు. అలాగే కమల్ హాసన్ ఓ బ్లాక్ స్వ్కాడ్ కెప్టెన్ ఆ పాత్ర ప్రయాణమూ ఓ అద్భుతంగానే ఉంటుంది. ఇలా ఒకటి కాదు లోకేశ్ సినిమేటిక్ యూనివర్స్ లో ఇంకా ఎన్నైనా తీయొచ్చు. 

  లోకేశ్ పనితీరుకు అద్దంపట్టే అంశాలు:

  ఖైదీ, విక్రమ్ ఈ రెండు సినిమాల్లో డీటెయిలింగ్ ఎంతా పక్కాగా ఉందంటే హాలివుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోదు. ఖైదీలో డ్రగ్స్ బ్యాగులపై తేలు గుర్తు ఉంటుంది. అదే మనకు విక్రమ్ లోనూ కనిపిస్తుంది. ఖైదీలో అర్జున్ దాస్ ( గ్యాంగ్ లో ఓ పాత్ర) కానిస్టేబుల్ ఫైర్ ఎక్స్టిగ్వింషర్ తో కొడతాడు. విక్రమ్ లోనూ ఆ గాయాలను చక్కగా చూపించాడు. 

  నిజంగా ఈ సినిమేటిక్ యూనివర్స్ కొనసాగితే మాత్రం భారతీయ సినీ చరిత్రలో లోకేశ్ కనగరాజ్ తనకంటూ ఒకటి కాదు రెండు పేజీలు రాసుకుంటాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv