తెలంగాణలో ఓటర్ల తుది జాబితా విడుదల
తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 2కోట్ల 99లక్షల 92వేల 941మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో కోటి 50 లక్షల 48వేల 250 మంది పురుష ఓటర్లు ఉన్నారు. కోటి 49 లక్షల 24 వేల 718 మంది మహిళ ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్లో ఓటర్ల సంఖ్య 42,15,456. రంగారెడ్డి జిల్లాలో 31,08,068 ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది.