• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బుమ్రా అత్యుత్తమ బౌలర్‌: వసీం

    ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రానే అత్యుత్తమ బౌలర్‌ అని పాక్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ అన్నారు. ‘ఇంగ్లాండ్‌ బ్యాటర్లను బుమ్రా భలే బోల్తా కొట్టించాడు. అతడి లెంగ్తే బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. బుమ్రా బౌలింగ్‌ వేగం, లెంగ్త్‌ అద్భుతం. నియంత్రణతో కూడిన వేగం, వైవిధ్యం వల్లే బుమ్రా స్థిరంగా రాణించగలుగుతున్నాడు. ఔట్‌ స్వింగర్లను నా మాదిరే వేస్తున్నాడు. అంతేకాదు కొన్నిసార్లు నన్ను మించిన నియంత్రణతో బౌలింగ్‌ చేస్తున్నాడు’ అని అక్రమ్‌ పొగడ్తలతో ముంచెత్తాడు.

    ‘టీమిండియాలో అతడు అవసరం’

    హార్దిక్‌ పాండ్య జట్టులో లేకపోయినా టీమిండియా బలంగానే ఉందని పాక్‌ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్‌ అన్నాడు. కివీస్‌తో మ్యాచ్‌లో షమీని తీసుకొని భారత్‌ మంచి పనిచేసిందన్నారు. షమీ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడని పేర్కొన్నాడు. ‘కివీస్‌తో మ్యాచ్‌లో షమీకి ఓపెనింగ్ స్పెల్‌ ఇవ్వలేదు. తనకెందుకు ఇవ్వలేదని అతడు నిరూత్సాపడలేదు. తన అనుభవాన్ని ఉపయోగించి జట్టును గెలిపించాడు. జట్టులో అతడు ఉండటం భారత్‌కు అవసరం’ అని వసీమ్ అభిప్రాయపడ్డాడు.

    పాక్ లో ఓ తరానికి నేను మ్యాచ్ ఫిక్సర్: వసీం అక్రమ్

    పాకిస్థాన్ లో ప్రస్తుత సామాజిక మాధ్యమాల తరం తనను ఇంకా మ్యాచ్ ఫిక్సర్ గానే చూస్తోందంటూ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ అన్నాడు. ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి దేశాల్లో మంచి పేస్ బౌలర్ ప్రస్తావన వస్తే తన పేరు కచ్చితంగా ఉంటుందన్నాడు. కానీ, పాకిస్థాన్ లో మాత్రం ప్రతి కామెంట్ లో తనను [మ్యాచ్ ఫిక్సర్](url) అని అంటారనే పేర్కొన్నాడు.1996 లో న్యూజిలాండ్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ పై అక్రమ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. Exclusive: Wasim Akram opens … Read more