• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Virat Kohli Biopic: విరాట్‌ కోహ్లీగా రామ్‌చరణ్ సెట్ అవుతాడా? సినిమా స్టోరీ, క్లైమాక్స్‌, డైరెక్టర్ల‌పై నెట్టింట్లో రచ్చ..

    రామ్‌చరణ్.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడు. సినిమా సినిమాకు తనలోని నటుడుని మెరుగు పరుచుకుంటూ స్థాయిని పెంచుకుంటున్న హీరో. RRR తర్వాత చరణ్ మేనియా మరింత పెరిగింది. దీంతో చెర్రీ అప్‌కమింగ్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్‌కి ఎనలేని ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో రామ్‌చరణ్ చెప్పిన చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి. 

    అవకాశం వస్తే రన్ మెషిన్ Virat Kohli Biopicలో నటిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు చరణ్. ఎప్పటి నుంచో క్రీడా నేపథ్యం కలిగిన సినిమా చేయాలని భావిస్తున్నట్లు మనసులో మాటను బయటపెట్టాడు. ఈక్రమంలో విరాట్ కోహ్లీ బయోపిక్ మూవీ స్టోరీ ఇలా ఉంటే బాగుంటుంది అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

    ఫస్టాఫ్‌లో కథ ఇలా..

    విరాట్ కోహ్లీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను సినిమాలో చూపించొచ్చు. అండర్19 వరల్డ్‌కప్ ఛాంపియన్, జాతీయ జట్టుకు ఎంపిక, 2011 వన్డే వరల్డ్‌కప్, కెప్టెన్సీ బాధ్యతలు, రికార్డులు, ఫామ్ లేమి, కమ్‌బ్యాక్ వంటి దశలను ఫస్టాప్‌లో చపిస్తే బాగుంటుంది. అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అతడి జీవితంలో కీలక ఘట్టం. దీంతో సినిమాలో లవ్ ట్రాక్‌కి రూట్ క్లియర్ అయినట్లే. విరాట్ కోహ్లీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. కెరీర్‌లో వివిధ స్థాయుల్లో కొనసాగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ మనోగతం ఏంటో సినిమా ద్వారా చూపించొచ్చు. 

    క్లైమాక్స్ ఇలా ఉంటే సూపర్బ్

    భారత్‌కు కోహ్లీ ఎన్నో విజయాలు అందించాడు. జట్టును అత్యుత్తమంగా నడిపించాడు. కానీ, చిరస్థాయిలో నిలిచిపోయే ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోలేక పోయాడు. వన్డే, టీ20 వరల్డ్‌కప్, టెస్టు ఛాంపియన్‌షిప్.. ఇలా కీలక ట్రోఫీలన్నీ నోటిదాకా అంది చేజారిపోయినవే. ఇలాంటివి సినిమాలో మంచి ఎమోషన్స్‌ను పండిస్తాయి. టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్ గెలిస్తే విరాట్ బయోపిక్‌కి స్టోరీ లైన్ దొరుకుతుంది. అప్పుడు సినిమాకు మంచి క్లైమాక్స్ పాయింట్ దొరుకుతుంది.

     బహుశా విరాట్ కోహ్లీ ఆడబోయే చివరి వన్డే వరల్డ్‌కప్ కూడా ఇదే అయ్యుంటుంది. మళ్ళీ వరల్డ్‌కప్ 2027లో జరుగుతుంది. అప్పటికి కోహ్లీ వయసు 38కి చేరుకుంటుంది. కాబట్టి ఈ వరల్డ్‌కప్ కోహ్లీకి గొప్ప జ్ఞాపకంగా మిగిలే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా బయోపిక్ కోసం ఈ వరల్డ్‌కప్‌ విజయాన్నే స్ఫూర్తిగా తీసుకోవచ్చు.

    ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా..

    విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించిన ఘటనను ఇంటర్వేల్ బ్యాంగ్‌గా ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ తర్వాత వరుస సెంచరీలతో కోహ్లీ కమ్ బ్యాక్‌ ఇచ్చిన తీరును సెకండాఫ్‌లో హైలెట్ చేస్తే బాగుంటుంది.

    వివాదాలపై క్లారిటీ..

    విరాట్ ఓ పోరాటయోధుడు. కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగాడు.  అతనిపై కెప్టెన్సీ వివాదం తీవ్ర ప్రభావం చూపించింది. భారత జట్టుకు నాయకత్వ బాధ్యతల నుంచి తనను అర్ధంతరంగా తప్పించారని విరాట్ ఆరోపించాడు. అయితే, ఇది వాస్తవం కాదని అప్పటి బీసీసీఐ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో ఇలాంటి వివాదాలపై సినిమాలో ఓ క్లారిటీ ఇస్తే అది ఫలప్రదంగా ఉంటుందని విరాట్ ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. 

    రామ్ చరణ్- కోహ్లీ పోలికలు

    రామ్‌చరణ్, విరాట్ కోహ్లీ ముఖ కవలికలు ఒకే విధంగా ఉంటాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ మేరకు విరాట్, చెర్రీల ఫొటోలను పక్కపక్కన పెట్టి పోల్చుతున్నారు. విరాట్‌ బయోపిక్‌ని చేయడానికి చరణ్ సరిగ్గా నప్పుతాడని అంటున్నారు. 

    చరణ్‌లోనూ క్రికెటర్..

    రామ్‌చరణ్‌లోనూ ఓ క్రికెటర్ ఉన్నాడు. సెలబ్రిటీల కోసం జరుపుతున్న ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌’లోనూ చరణ్ పాల్గొన్నాడు. తెలుగు వారియర్స్ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ ఆడటం చరణ్‌కి అలవాటే కాబట్టి విరాట్ స్టైల్‌లో షాట్లు ఆడగలడని చెబుతున్నారు. 

    ఫిట్‌నెస్.. 

    విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటాడు. రామ్‌చరణ్‌కూ ఫిట్‌నెస్ మెరుగ్గా ఉంటుంది. క్రికెట్ ఆడాలన్నా, ఆడుతున్నట్లు నటించాలన్నా ఫిట్‌నెస్ అవసరం. కొన్ని షాట్లు ఎక్కువ టేక్‌లు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలోనూ చరణ్ మనుగడ సాగించగలడు. 

    ఈ డైరెక్టర్లు కావాలంట..

    ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును టేకప్ చేయడం కూడా డైరెక్టర్లకు ఒక సవాళే. కాబట్టి, ఫ్యాన్స్ కొందరి డైరెక్టర్ల పేర్లు సూచిస్తున్నారు. ‘జెర్సీ’ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి పేరు ముందుగా వినిపిస్తోంది. ఎం.ఎస్ ధోనీ సినిమా తీసిన ‘నీరజ్ పాండే’కు అనుభవం కలిసొస్తుంది. ఇక విలక్షణ దర్శకుడు సుకుమార్ ఈ ప్రాజెక్టును మరో స్థాయికి తీసుకెళ్తాడని భావిస్తున్నారు. హీరోయిజంను పండించే సందీప్ రెడ్డి వంగా, పూరీ జగన్నాథ్; కొరటాల శివ, గౌతమ్ మీనన్, ప్రశాంత్ నీల్, హను రాఘవపూడి పేర్లను సూచిస్తున్నారు.  

    హీరోయిన్‌లు..

    విరాట్ బయోపిక్‌లో హీరోయిన్‌గా పూర్తిగా న్యాయం చేయగలిగే నటి అనుష్క శర్మనే. విరాట్ రియల్ లైఫ్ పార్ట్‌నర్ కావడం ఈమెకు ప్లస్ పాయింట్. పైగా తన అనుభవం కూడా సినిమాకు పనికొస్తుంది. కృతిసనన్, శ్రద్ధా కపూర్, లవ్‌టుడే నటి ఇవానా, కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్ ఈ పాత్రలకు సెట్ కాగలరని ఊహిస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv