• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • #90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్‌ ఎలా ఉందంటే? 

    నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు

    రచనం, దర్శకుడు: ఆదిత్య హాసన్

    సంగీతం: సురేష్‌ బొబ్బలి

    సినిమాటోగ్రఫీ: అజాజ్‌ మహ్మద్‌

    ఎడిటింగ్‌: శ్రీధర్‌ సోంపల్లి

    నిర్మాత: రాజశేఖర్‌ మేడారం

    శివాజీ, వాసుకి జంటగా నటించిన లెేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘#90’s. ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ఈ వినోదాత్మక సిరీస్‌ను రాజశేఖర్‌ మేడారం నిర్మించారు. మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలతో నవ్వులు పూయిస్తూ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిరీస్‌ను రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు. కాగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సిరీస్‌ ప్రసారంలోకి వచ్చింది. మరి దీని కథేంటి? లెక్కల మాస్టార్‌గా శివాజీ ఎలా నటించారు? ఇప్పుడు చూద్దాం.

    కథ

    చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్‌. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. ప్రభుత్వ టీచర్‌ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో జాయిన్‌ చేస్తాడు. వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్‌ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. మరి వచ్చిందా? క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

    ఎవరెలా చేశారంటే

    చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఒదిగిపోయారు. మిడిల్ క్లాస్ తండ్రులందరికీ ప్రతినిధిగా ఆయన కనిపించారు. మధ్య తరగతి గృహిణి రాణిగా వాసుకీని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. భర్తతో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంట్లో పరిస్థితి గురించి చెప్పే సన్నివేశంలో ఆమె అద్భుత నటన కనబరిచారు. రఘు పాత్రలో మౌళి నటన సహజంగా ఉంది. అతడు చక్కగా చేశాడు. వాసంతి, స్నేహాల్ కామత్ అందంగా నటించారు. చిన్నోడు రోహన్ అయితే పక్కా నవ్విస్తాడు. చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల అతిథి పాత్రలో మెప్పిస్తారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    90లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ చక్కగా తెరపై ఆవిష్కరించారు. కథ రొటిన్‌గా అనిపించినప్పటికీ క్యూట్ & లిటిల్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకున్నాడు. ఆరు ఎపిసోడ్స్‌ కలిగిన ఈ సిరీస్‌తో ప్రేక్షకులను 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లి ఆ స్మృతులను ఆదిత్య గుర్తుచేశారు. కుటుంబ విలువలను సిరీస్‌లో చక్కగా చూపించారు. చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కునే ’90స్’ మధ్యతరగతి కుటుంబాన్ని కళ్లకు కట్టారు. ముఖ్యంగా మనం 90ల నాటి పిల్లలమైతే ఈ సిరీస్‌కు కనెక్ట్‌ అవుతాం. దర్శకుడు ఆదిత్య హాసన్‌ ప్రతి ఒక్కరికీ అందమైన జ్ఞాపకాలను అందించారు.

    టెక్నికల్‌గా

    సాంకేతికంగా #90’s సిరీస్‌ బాగుంది. సంగీతం, ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి యూనిట్‌ పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • నటీనటులు
    • కథ, దర్శకత్వం
    • సాంకేతిక విభాగం 

    మైనస్‌ పాయింట్స్‌

    • నెమ్మదిగా సాగే కథనం

    రేటింగ్‌: 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv