ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తాజాగా టెస్లా కార్ల ప్లాంట్‌ను ఇండియాలో పెట్టాలని చూస్తున్నాడు. దానికి కేంద్రం నుంచి సరైన అనుమతులు రావడంలో లేట్ అవుతుందని ఎలన్ మస్క్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దానికి స్పందిస్తూ తెలంగాణకు రావాలని కేటీఆర్ ట్వీట్ చేశాడు. ఇక తెలుగు సెలబ్రెటీలు కూడా వరుసగా మస్క్‌కు ట్వీట్లు చేస్తున్నారు. తెలంగాణకు రావాలని తెలంగాణలో ప్రభుత్వ విధానాలు చాలా సులభంగా ఉంటాయని తెలుపుతూ మంత్రి కేటీఆర్ టెస్లా సీఈవో మస్క్‌కు ట్వీట్ చేశారు.
ఇక ఆ ట్వీట్ తర్వాత అనేక మంది రాజకీయ ప్రముఖులు కేటీఆర్‌ను విమర్శించారు. కానీ చాలా మంది సినీ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ మస్క్‌కు ట్వీట్లు చేస్తున్నారు.
రావాలంటూ ఆహ్వానం పలికిన రౌడీ..
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాధించుకున్న విజయ్ దేవరకొండ ఎలన్ మస్క్‌ను ఆహ్వానిస్తూ ట్వీట్ చేశాడు. హైదరాబాద్ ఎపిక్ ప్లేస్ అని ఇక్కడకు రావాలని ఆహ్వానం పలికాడు. తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా సహకరిస్తుందని తెలిపాడు.
నిఖిల్ కూడా అదే దారిలో…
ఇక యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ కూడా విజయ్ దేవరకొండ దారిలోనే పయనించాడు. తెలంగాణకు రావాలని టెస్లా సీఈవోకు ట్వీట్ చేసిన కేటీఆర్‌ను అభినందించాడు.
తెలంగాణ బెస్ట్ ల్యాండ్: మెహర్ రమేష్
ఇక ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ట్వీట్ చేస్తూ ఎలన్ మస్క్ మీకు తెలంగాణలో బెస్ట్ ల్యాండ్ పక్కాగా దొరుకుతుందని తెలిపాడు. కేటీఆర్ బెస్ట్ మినిస్టర్ అని కితాబిచ్చాడు.
టెస్లా కారు సూపర్: జెనీలియా…
ఇక ఒకప్పుడు తన అందం అభినయంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపిన జెనీలియా కూడా ఈ విషయంపై ఎలన్ మస్క్‌కు ట్వీట్ చేసింది. టెస్లా కార్లు సూపర్‌గా ఉంటాయంటూనే తెలంగాణకు రావాలని ఎలన్ మస్క్‌ను ఆహ్వానించింది.
తెలంగాణ ఇండియాలో బిజినెస్ హబ్: గోపీచంద్..
ఇండియాలో తెలంగాణ రాష్ట్రం బిజినెస్ హబ్ అని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సహకారాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణలో టెస్లా కంపెనీని ఏర్పాటు చేయాలని ఎలన్ మస్క్‌కు విన్నవించుకున్నారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి