చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో, తన తాజా V-సిరీస్‌లో భాగంగా త్వరలో భారత మార్కెట్‌లోకి Vivo V40e ను విడుదల చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్, ఇప్పటికే విడుదలైన Vivo V40 ప్రో, Vivo V40 మోడల్స్‌కు జతగా వస్తుందని అంచనా. కంపెనీ ఇంతవరకు ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఎటువంటి వివరాలను అధికారికంగా ప్రకటించలేదు, అయినప్పటికీ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్లలో దీని వివరాలు లీకయ్యాయి. ముఖ్యమైన ఫీచర్ల వివరాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవతున్నాయి. వాటిపై ఓలుక్ వేద్దాం.
Vivo V40e లాంచ్ డేట్
MySmartPrice నివేదిక ప్రకారం, Vivo V40e సెప్టెంబర్ చివరలో విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. హ్యాండ్‌సెట్ ధర ఎంత అనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు, కానీ ఈ నెలలోనే అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం, Vivo V40e “రాయల్ బ్రాంజ్” రంగులో లభ్యమవుతుందని తెలుస్తోంది.
Vivo V40e స్పెసిఫికేషన్లు
Vivo V40eలో కర్వ్డ్ డిస్‌ప్లే ఉండబోతుందని, దీని పీక్ బ్రైట్‌నెస్ 4,500 నిట్స్ అని నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా, గత లీకుల ప్రకారం, Vivo V40e ఫన్‌టచ్ OS 14 (ఆండ్రాయిడ్ 14) ఆధారంగా పనిచేస్తుందని, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో రానుందని సమాచారం.
ఈ నివేదిక ప్రకారం, Vivo V40e 5,500mAh బ్యాటరీతో రానుందని తెలిసింది. ఇది ఈ సంవత్సరం విడుదలైన ఇతర మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడనుంది. దీని ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం 80W ఉంటుందని అంచనా.
గత నెలలో, ఈ హ్యాండ్‌సెట్ భారత్‌కు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో V203 మోడల్ నంబర్‌తో లిస్ట్ చేయబడింది. అదేవిధంగా, Vivo V40e Geekbenchలోనూ కనిపించింది. దీని డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్, 8GB RAM రానుందని తెలిసింది.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!