• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devaki Nandana Vasudeva Review: మ్యాటర్‌ లేని కథను కట్టబెట్టిన ప్రశాంత్‌ వర్మ? పాపం అశోక్‌ గల్లా!

    నటీనటులు : అశోక్‌ గల్లా, మానస వారణాసి, దేవదత్త నాగే తదితరులు

    డైరెక్టర్‌ : అర్జున్ జంధ్యాల

    కథ : ప్రశాంత్ వర్మ

    డైలాగ్స్‌: బుర్ర సాయి మాధవ్‌

    సినిమాటోగ్రాఫీ: ప్రసాద్‌ మురెళ్ల, రసూల్‌

    ఎడిటింగ్‌: తిమ్మరాజు

    విడుదల తేదీ: నవంబర్‌ 22, 2024

    ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్‌ కుమారుడు, మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ‘ (Devaki Nandana Vasudeva Review). హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్‌ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని చిత్ర యూనిట్‌ మెుదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో నవంబర్‌ 22న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కథలో ప్రశాంత్ వర్మ మార్క్‌ కనిపించిందా? ఇప్పుడు తెలుసుకుందాం.

    కథేంటి

    కంసరాజు (దేవదత్తా) పరమదుర్మార్గుడు. ఒక రోజు కాశీకి వెళ్లిన కంసరాజుకు అఘోరా తారసపడి నీ మరణం నీ చెల్లెలికి పుట్టబోయే మూడో సంతానం చేతిలో ఉందని చెప్తాడు. దీంతో కడుపుతో ఉన్న చెల్లి (దేవయాని)పై కంసరాజు దాడి చేస్తాడు. ఆమె భర్త చనిపోవడంతో 21 సంవత్సరాల పాటు జైలుకు వెళ్తాడు. అయితే కంసరాజు చెల్లికి ఆడపిల్ల సత్య (మానస వారణాసి) పుడుతుంది. పెద్దయ్యాక ఆమెను కృష్ణ (అశోక్‌ గల్లా) ప్రేమిస్తాడు. ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన కంసరాజు మేనకోడలు సత్యను ఏం చేశాడు? కంసరాజుకు తెలియకుండా అతడి చెల్లెలు దాచిన సీక్రెట్ ఏంటి? తన ప్రేమను గెలిపించుకోవడం కోసం సత్య ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    కృష్ణ పాత్ర కోసం అశోక్‌ గల్లా (Devaki Nandana Vasudeva Review) చాలా కష్టపడ్డాడు. అతడి కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. గత చిత్రంతో పోలిస్తే నటన, బాడీ లాంగ్వెజ్‌పరంగా అశోక్‌ మెరుగయ్యాడు. కీలకమైన సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌గా మానస వారణాసి అలరించింది. తెరపై వారి కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే భావోద్వేగాలు పలికించే విషయంలో మానస అక్కడక్కడ తడబడింది. విలన్‌గా దేవదత్తా నాగే ఆకట్టుకున్నాడు. అతడి చెల్లెలు పాత్రలో దేవయాని నటన బాగుంది. హీరో తల్లి పాత్రలో ఝాన్సీ చక్కగా చేసింది. సంజయ్‌ స్వరూప్‌, శత్రు, శ్రీధర్‌ రెడ్డి, గెటప్‌ శ్రీను తదితరులు తమ పరిధిమేరకు చేశారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    హనుమాన్‌ (Hanuman) ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) అందించిన కథలో పెద్దగా స్టఫ్‌ లేదు. స్టోరీకి మైథాలజీని ముడిపెట్టినప్పటికీ అది ఎక్కడా సింక్‌ అయినట్లు అనిపించదు. పురాణాల నేపథ్యం లాజిక్‌ లెస్‌గా అనిపిస్తుంది. దర్శకుడు అర్జున్‌ జంధ్యాల కథనంలోనైనా మ్యాజిక్ చేయాల్సింది. కానీ అలా జరగలేదు. స్క్రీన్‌ప్లేను ఇంట్రస్టింగ్‌గా నడిపించడంలో విఫలమయ్యాడు. ఓ మూఢనమ్మకాన్ని ప్రోత్సహించేలా తెరకెక్కించిన సీన్స్‌ స్వాగతించేలా లేవు. ఇక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ కూడా పేలవంగా అనిపిస్తుంది. కృష్ణ, కంసరాజు మధ్య వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ సైతం బలంగా చూపించలేకపోయారు. కృష్ణ పాత్రను ఎలివేట్‌ చేసేందుకు తీసిన కొన్ని సీన్స్‌ మరీ ఓవర్‌గా అనిపిస్తాయి. మెుత్తానికి దర్శకుడు చాలా చోట్లనే ప్రేక్షకులకు బోర్‌ కలిగించాడు. 

    సాంకేతిక అంశాలు

    టెక్నికల్‌ విషయాలకు వస్తే భీమ్స్‌ సిసిలియో సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను అతడి నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటర్‌ తమ్మిరాజు పనితనం ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదు. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • అశోక్‌ గల్లా నటన
    • యాక్షన్‌ సీక్వెన్స్‌
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • మెరుపులు లేని కథనం
    • లవ్‌ట్రాక్‌
    • మిస్‌ఫైర్‌ అయిన మైథాలజీ టచ్‌

    Telugu.yousay.tv Rating : 2/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv