• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rashmika Mandanna: ‘పుష్ప 2’ రిలీజ్‌ తర్వాత రష్మిక – విజయ్‌ దేవరకొండ పెళ్లి?

    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ చెప్పినా అభిమానులు మాత్రం నమ్మడం లేదు. వారిద్దరు కలిసి విహారయాత్రలు, రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటమే ఇందుకు కారణం. రీసెంట్‌గా ‘పుష్ప 2‘ కి సంబంధించి జరిగిన చెన్నై ఈవెంట్‌లో రష్మిక నేరుగా విజయ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు హింట్‌ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా వీరి రిలేషన్‌ (Vijay Devarakonda – Rashmika Mandanna Engagement)కు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌ చేస్తోంది. దీంతో ఇరువురి ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    పుష్ప 2 రిలీజ్‌ తర్వాత నిశ్చితార్థం?

    అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. గత మూడేళ్లుగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడిపింది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఆడియన్స్‌లో భారీగా అంచనాలు పెంచేస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న నిశ్చితార్థం (Vijay Devarakonda – Rashmika Mandanna Engagement) చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 విడుదలైన డిసెంబర్‌ 5 తర్వాత ఏ క్షణమైన ఈ గుడ్‌న్యూస్‌ వినొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ నెలలో నిశ్చితార్థం నిర్వహించి వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda – Rashmika Mandanna Wedding) చేయాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రష్మిక – విజయ్‌ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో రష్మిక, విజయ్‌ ఫ్యాన్స్‌ ఈ వార్త నిజం కావాలని బలంగా కోరుకుంటున్నారు. అదే జరిగితే తమ సంతోషానికి అవధులు ఉండవని కామెంట్స్ చేస్తున్నారు. 

    చెన్నై ఈవెంట్‌లో రష్మిక హింట్‌

    కొద్దిరోజుల క్రితం చెన్నై వేదికగా జరిగిన ‘పుష్ప 2’ ప్రమోషనల్ ఈవెంట్‌లో రష్మిక మందన్న కీలక వ్యాఖ్యలు చేసింది. విజయ్‌ దేవరకొండతో లవ్‌  (Vijay Devarakonda – Rashmika Mandanna Wedding) పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. యాంకర్ అడిగిన ప్రేమ, పెళ్లి ప్రశ్నలపై ఏమాత్రం తడుముకోకుండా సమాధానాలు ఇచ్చింది. ‘మీకు చాక్లెట్‌ బాయ్‌ అంటే ఇష్టమా? లేదా రౌడీ బాయ్‌ అంటే ఇష్టమా?’ అని అడగ్గా ‘ఆ రెండింటి కాంబినేషన్‌ అంటే ఇష్టం’ అని రష్మిక అన్నది. ‘సినీ పరిశ్రమలో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లేదా బయట వ్యక్తిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా?’ అని యాంకర్‌ ప్రశ్నించగా ‘ఇది అందరికీ తెలిసిన విషయమే’ అని నవ్వులు పూయించింది. దీంతో విజయ్‌ దేవరకొండతో ప్రేమలో ఉన్నానని రష్మిక చెప్పకనే చెప్పిందని నెటిజన్లు చర్చించుకున్నారు. 

    విజయ్‌-రష్మిక రెస్టారెంట్‌ పిక్‌ వైరల్‌

    విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న (Rashmika Mandanna) జోడి గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే ఒకే ఏరియా బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న వారి ఫొటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా ఇలాంటి ఫొటో ఒకటి మరోమారు నెట్టింట వైరల్ అయ్యింది. ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి ఫుడ్‌ తిన్నట్లు ఆ ఫొటోలో కనిపించింది. ఎవరో ఈ ఫొటో సీక్రెట్‌గా తీసి నెట్టింట పంచుకున్నారు. ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ తీశారన్ని మాత్రం తెలియలేదు. ఇందులో విజయ్ ఫేస్‌ స్పష్టంగా కనిపించినప్పటికీ రష్మిక ఫేస్‌ సరిగా కనిపించలేదు. అయితే తాను ఫుడ్‌ తింటున్నట్లు రష్మిక ఓ ఫొటో షేర్‌ చేయగా అది ఆ రెస్టారెంట్‌లో తీసింది కావడం గమనార్హం. ఈ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి నెటిజన్లు ట్రెండ్ చేశారు. మరోమారు విజయ్‌ జోడి దొరికేసిందంటూ పోస్టులు పెట్టారు.

    డేటింగ్‌పై లీక్‌ ఇచ్చేసిన విజయ్‌!

    రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఇటీవల ‘సాహిబా’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించాడు. ఆ సాంగ్‌ ప్రమోషన్స్ సందర్భంగా రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ (Vijay Devarakonda – Rashmika Mandanna Wedding) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సింగిల్‌ కాదని, కోస్టార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇటీవల ఈ వ్యాఖ్యలు సైతం వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్‌  ‘VD12’ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది.  ఇది పూర్తయ్యాక ఆయన మైత్రి మూవీ మేకర్స్‌లో రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కించనున్నారు. 

    విజయ్‌ తమ్ముడితో చెప్పింది గుర్తుందా!

    విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న చేసిన కామెంట్స్‌ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆ వేడుకలో  రష్మికను ఆనంద్‌ పలు ప్రశ్నలు అడిగాడు. అప్పట్లో రష్మిక పోస్టు చేసిన పెట్‌ డాగ్‌ ఫొటోల్లో విజయ్ పెట్‌ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్‌ అని అడగ్గా, ఆరా (రష్మిక పెట్‌ డాగ్‌) నా ఫస్ట్‌ బేబీ, స్మార్ట్‌ (విజయ్‌ పెట్‌ డాగ్‌) నా సెకండ్‌ బేబీ అని రష్మిక చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్‌ కో-స్టోర్‌ ఎవరు అని ఆనంద్‌ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్‌ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్‌ తీసుకొని ‘ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా’ అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్‌ వెంటనే రౌడీ, రౌడీ స్టార్‌ అని అరడవంతో రౌడీ బాయ్‌ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv