• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2: సినిమా చూడండి అంటూ నాగబాబు ట్వీట్.. తగ్గేదేలే అంటున్న మెగా ఫ్యాన్స్

    అల్లుఅర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై మెగా ఫ్యాన్స్‌ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. అంతేకాదు ‘పుష్ప 2’కి సంబంధించి ఏ చిన్న నెగిటివ్‌ వార్త కనిపించినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ నెట్టింట దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం దీటుగా బదులిస్తుండటంతో గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ రచ్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే గురువారం (డిసెంబర్‌ 5) ‘పుష్ప 2’ వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. మరో రెండు గంటల్లో ప్రీమియర్స్‌ సైతం పడనున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి సోదరుడు నాగబాబు ఎక్స్‌ వేదికగా మెగా ఫ్యాన్స్‌కు కీలక సూచనలు చేశారు.

    ‘సినిమాను చూడండి’

    మెగా బ్రదర్‌ నాగబాబు (Nagababu) ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘24 క్రాఫ్ట్‌ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో, వేల‌ మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ పోస్టులో ఎక్కడా ‘పుష్ప 2’ పేరును ప్రస్తావించడం, ట్యాగ్‌ చేయడం వంటివి చేయలేదు. కానీ, మరికొద్ది గంటల్లో అల్లు అర్జున్‌ సినిమా రిలీజ్‌ ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. మెగా అభిమానులు ఈ సినిమా చూడాలని పరోక్షంగా సూచించారని అర్థమవుతోంది.

    మెగా ఫ్యాన్స్ రియాక్షన్‌ ఇదే..

    నాగబాబు పిలుపుపై మెగా ఫ్యాన్స్ రియాక్ట్‌ అవుతున్నారు. మీ మాటపై తమకు గౌరవముందని, కానీ తాము ‘పుష్ప 2’ సినిమాను చూడమని తేల్చి చెబుతున్నారు. ఈ విషయంలో అస్సలు ‘తగ్గేదేలే’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌ను నెట్టింట పోస్టు చేస్తున్నారు. తమకు ఇష్టం ఉంటేనే వెళ్తామని, లేకపోతే అస్సలు వెళ్లమని తేల్చి చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ తమ మెుదటి ప్రేయారిటీ అని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్మీ సైతం నాగబాబు పోస్టుపై రియాక్ట్‌ అవుతోంది. డైరెక్ట్‌గా ‘పుష్ప 2’ పేరు ప్రస్తావించి ఉంటే బాగుండేదని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ మెగా వర్సెస్‌ అల్లు వార్‌ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. 

    https://publish.twitter.com/?url=https://twitter.com/Janasena200/status/1864294848754536790# 

    ‘తప్పును సరిదిద్దుకో’

    రెండ్రోజుల క్రితం నాగబాబు (Naga Babu) పెట్టిన ట్వీట్‌ సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అది కూడా ‘పుష్ప 2’ రిలీజ్‌ నేపథ్యంలోనే చేసినట్లు స్పష్టంగా అర్థమైంది. ‘నువ్వు తప్పుడు దారిని ఎంచుకున్నావు అని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గమనించి సరి చేసుకో. లేదంటే ముందు ముందు ఆ దారి నీకు మరింత కష్ట తరంగా మారగలదు. తప్పును సరిదిద్దుకో’ అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ అల్లు అర్జున్‌ (Allu Arjun)ను ఉద్దేశించే చేశారని నెటిజన్లు చర్చించుకున్నారు. తప్పులను సరిదిద్దుకొని మెగా ఫ్యామిలీతో కలిసిపోవాలని పరోక్షంగా నాగబాబు సూచించినట్లు అంతా భావించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv