ఇండియన్ సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషన్ క్రష్ రష్మిక మంధాన హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈక్రమంలో ఈ సినిమాపై ప్రముఖ ఫిల్మ్ క‌్రిటిక్ ఉమెర్ సంధు ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా పైసా వసూల్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. బన్నీ ఫ్యాన్స్‌ను జోష్‌లో ముంచేసింది.
పుష్ప ఫస్ట్ పార్ట్ ఘనవిజయం సాధించడంతో, పుష్ప-2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ ఈ సీక్వెల్ లో తన మాస్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యాక అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది.
అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా నిలిచాడు. బన్నీ పుష్పలో తన మేనరిజంతో, మాస్ యాక్టింగ్‌తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
పుష్ప-2 పై ప్రేక్షకుల అంచనాలు
ఫస్ట్ పార్ట్‌కు ఉత్తరాది ప్రేక్షకులు విపరీతంగా స్పందించడంతో, సీక్వెల్ పై మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘పుష్ప-2’ కోసం నార్త్ ఆడియన్స్ ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ విడుదల సమయంలోనే పుష్ప హిందీలో రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ సీక్వెల్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ప్రీమియర్ షోల హైప్– అల్లు అర్జున్ అటెండ్
డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది అభిమానుల్లో భారీ అంచనాలను కలిగిస్తోంది. టిక్కెట్లు ముందుగానే హాట్ కేక్‌లా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లోని సుదర్శన్ 70MM థియేటర్‌లో అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని స్వయంగా అభిమానులతో కలిసి చూడనున్నారు.
ఉమేర్ సందు ఫస్ట్ రివ్యూ
ప్రపంచ ప్రఖ్యాత సినీ విమర్శకుడు ఉమేర్ సందు ‘పుష్ప-2’ పై ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీని “బ్లాక్ బస్టర్ పైసా వసూల్ ఎంటర్టైనర్”గా అభివర్ణించాడు. సినిమాలో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ హైలైట్ అని, అల్లు అర్జున్ మళ్లీ నేషనల్ అవార్డు గెలవడం ఖాయమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అల్లు అర్జున్ మాస్ అవతార్
ఉమేర్ సందు ట్వీట్ చేస్తూ, “అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అతని మాస్ అవతారం ఈ సినిమా కీలక ఆకర్షణ. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టాడు” అని అభినందించారు. ముఖ్యంగా క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్లలో అల్లు అర్జున్ అదరగొట్టాడని పేర్కొన్నారు.
రష్మిక, ఫహాద్ ఫాజిల్ మెస్మరైజింగ్
రష్మిక మందన్నా సీక్వెల్లో తన పాత్రకు న్యాయం చేస్తూ, అభిమానుల మన్ననలు పొందిందని ఉమేర్ పేర్కొన్నాడు. రష్మిక- అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ అభిమానులను అలరిస్తుందని పేర్కొన్నారు. అలాగే, ఫహాద్ ఫాజిల్ సెకండ్ పార్ట్‌లో పూర్తి స్థాయిలో డామినేట్ చేస్తాడని పేర్కొన్నాడు. తన నటనతో ప్రత్యేకమైన ముద్రవేసాడని అభినందించారు.
బాహుబలి, కేజీఎఫ్ లాంటి రికార్డులను బద్దలు కొడుతున్న పుష్ప-2
ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే బాహుబలి-2, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల రికార్డులను అధిగమించింది. తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రత్యేకమైన మసాలా మూవీగా గుర్తింపు
‘పుష్ప-2’ ని ఇండియన్ సినిమా చరిత్రలో విభిన్నమైన మసాలా మూవీగా ఉమేర్ పేర్కొన్నారు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులకు విందుగా ఉంటాయని తెలిపారు.
మూడేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న ‘పుష్ప-2’ భారీ విజయం సాధించడం ఖాయం. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎన్ని మైలురాళ్లను దాటుతుందో చూడాలి. ‘పుష్ప-2 ది రూల్’తో అల్లు అర్జున్ మరోసారి తన మ్యాజిక్ చూపించనున్నాడు.
మరి కాసేపట్లో పుష్ప 2 పూర్తి రివ్యూ రానుంది.. అప్‌డేట్స్ కోసం YouSay Telugu వెబ్‌సైట్ ఫాలో అవ్వండి.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..