అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), హీరోయిన్ శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) మరికొద్ది గంటల్లో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివాహ మండపంలో బుధవారం (డిసెంబర్ 4) రాత్రి వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. స్టూడియోస్‌లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహానికి ఎదురుగా ఈ పెళ్లి వేదికని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నవ జంటకు ఏఎన్నార్ ఆశీర్వాదాలు ఉండాలని ఇలా ఏర్పాటు చేశారు. అయితే శోభితను ఎంతో ఇష్టపడి నాగచైతన్య వివాహం (Naga Chaitanya Wedding) చేసుకోబోతున్నారు. ఒక్క సినిమా చేయనప్పటికీ వీరి ప్రేమకథ ఎలా మెుదలైందా? అని సినీ లవర్స్ చెవులు కొరికేసుకుంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెుదటి పరిచయం ఎలాగంటే..
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu)ను 2017 అక్టోబర్‌లో నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 2021 అక్టోబర్‌లో ఈ జంట విడిపోయింది. అప్పటి నుంచి కొన్ని నెలల పాటు నాగచైతన్య ఒంటరిగా ఉన్నారు. ఈ క్రమంలో అడివి శేష్, శోభిత నటించిన ‘మేజర్’ (Major) ప్రమోషన్స్‌లో నాగ చైతన్య పాల్గొన్నాడు. ఆ వేదికపై తొలిసారి శోభితతో పరిచయం అయ్యింది.
బర్త్‌డే పార్టీతో ఫ్రెండ్‌షిప్..
‘మేజర్’ ప్రమోషన్స్ జరిగిన కొద్ది రోజులకే శోభిత బర్త్‌డే (మే 31) వచ్చింది. అప్పటికే ఏర్పడిన పరిచయంతో నాగచైతన్యను పుట్టిన రోజు వేడుకలకు శోభిత ఆహ్వానించింది. వాటికి హాజరైన నాగచైతన్య ఆమెకు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం. శోభిత బర్త్‌డే నుంచి వారి మధ్య స్నేహం ఏర్పడింది.
కొద్ది రోజులకే స్ట్రాంగ్ రిలేషన్..
చైతూ – శోభిత (Sobhita Dhulipala Wedding) స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఇరువురి ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టా ఇష్టాలు కలవడంతో తక్కువ సమయంలోనే ఒకరికొకరు దగ్గరయ్యారు. ఒకరిపట్ల ఒకరికి స్నేహానికి మించిన బంధం ఉందని అర్థం చేసుకున్నారు. తమ లవ్‌ను వ్యక్తం చేసుకొని ప్రేమికులుగా మారిపోయారు.
లవ్ గురించి ఎలా తెలిసిందంటే!
2022లోనే చైతూ – శోభిత (Naga Chaitanya And Sobhita Dhulipala Wedding) ప్రేమలో పడిపోయినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మాత్రం ఈ జంట చాలా సీక్రెట్‌గా ఉంచింది. ఈ క్రమంలో 2023 మార్చిలో తొలిసారి వీరి లవ్ గురించి రూమర్లు వచ్చాయి. ఓ రెస్టారెంట్‌లో దిగిన ఫొటోనూ నాగచైతన్య పోస్టు చేయగా వెనక శోభిత ఉండటం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. వారిద్దరు డేటింగ్‌లో ఉన్నారన్న అనుమానాలను కలిగించింది.
ఆ తర్వాత మరిన్ని సార్లు..
తమ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మెుదలైనా ఈ జంట ఎక్కడా స్పందించలేదు. దీంతో వీరి బంధాన్ని వెలికితీసేందుకు అభిమానులు క్లూస్ వెతకడం మెుదలుపెట్టారు. 2024 జూన్‌లో ‘వైన్ టేస్టింగ్ హాలీడే’లో వీరు పొల్గొన్న ఫొటో తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఓ దేశంలోని వీధుల్లో శోభిత, చైతూ.. జంటగా తిరుగుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది. అప్పుడు వారి చేతుల్లో షాపింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. దీంతో నిజంగానే వారు లవ్‌లో ఉన్నట్లు అభిమానులు కన్ఫార్మ్ చేసుకున్నారు.
ఆగస్టులో నిశ్చితార్థం..
ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకొని అందరినీ చైతూ జంట (Naga Chaitanya Wedding) సర్‌ప్రైజ్ చేసింది. ఈ విషయాన్ని నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తొలిసారి బాహ్య ప్రపంచానికి తెలియజేయడం విశేషం. శోభితను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు నాగార్జున తెలిపారు. నిశ్చితార్థపు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
పెళ్లి పనులపై అప్‌డేట్స్
నిశ్చితార్థం తర్వాత తమ పెళ్లికి సంబంధించి ఏ చిన్న కార్యం జరిగినా శోభితా (Sobhita Dhulipala) అభిమానులతో పంచుకుంటూనే ఉంది. పెళ్లి పనులు మెుదలు పెట్టడానికి చేసే పసుపు దంచే ఫొటోలను శోభిత స్వయంగా పంచుకుంది. మూడ్రోజుల క్రితం హల్దీ వేడుకులకు సంబంధించిన ఫొటోలను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అలాగే ‘పెళ్లి కూతురు’ క్యాప్షన్‌తో కాళ్లకు పసుపురాస్తున్న పిక్స్, మంగళహారతులు ఇస్తున్న ఫొటోలను సైతం పంచుకుంది.
పెళ్లికి అతిథులు ఎవరంటే
అతి కొద్ది మంది సమక్షంలోనే ఇవాళ (డిసెంబర్ 4) నాగ చైతన్య, శోభిత వివాహం (Naga Chaitanya And Sobhita Dhulipala Wedding) జరగనుంది. అక్కినేని, దూళిపాళ్ల, దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు పరిమిత సంఖ్యలో సన్నిహితులు, సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరుకానున్నారు. చిరంజీవి, ప్రభాస్, రామ్‌చరణ్, ఉపాసన, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఈ వేడుకకు హాజరుకానున్నారు. అలాగే పీవీ సింధు, డైరెక్టర్ రాజమౌళి కూడా పెళ్లి హాజరయ్యే ఛాన్స్ ఉంది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..