అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్‌లో రూపొందిన మోస్ట్ వాంటెడ్ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). ఈ మూవీ మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 5 (Pushpa 2 Release Date)న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా చిత్ర బృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబయి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించింది. వీటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న, ఐటెం సాంగ్ చేసిన శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఇలా మూవీలో కీ రోల్ పోషించిన అందరూ హాజరయ్యారు. కానీ, ‘పుష్ప 2’లో విలన్‌గా చేసిన మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ మాత్రం ఒక్క ఈవెంట్‌కు హాజరుకాలేదు. మూవీ టీమ్‌పై ఫహాద్ చాలా కోపంగా ఉన్నాడని, అందుకే ఈవెంట్స్ రావట్లేదన్న అనుమానాలు బలపడుతున్నాయి. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హోమ్ టౌన్ ఈవెంట్‌లోనూ మిస్సింగ్!
అల్లు అర్జున్, రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా చేసిన ‘పుష్ప’ (Pushpa: Part 1) చిత్రం 2021లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీసు ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) కనిపించాడు. అతడి నటన నెక్స్ట్ లెవల్లో ఉందంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. వాస్తవానికి అతడి పాత్ర నిడివి తొలి భాగంలో తక్కువే అయినా ‘పుష్ప 2’లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపిస్తాడని మేకర్స్ తెలిపారు. దీంతో ఫహాద్ ఏ స్థాయిలో మాయ చేస్తాడోనని అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో ఫహాద్ కనిపించకపోవడం ఓ పజిల్‌గా మారిపోయింది. స్వరాష్ట్రం కేరళలోని కొచ్చిలో జరిగిన ఈవెంట్‌కు సైతం అతడు దూరంగా ఉన్నాడు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pushpa 2 Pre release Event)కు సైతం ఫహాద్ డుమ్మా కొట్టాడు. దీంతో మూవీ టీమ్‌తో విభేదాల వల్లే ఫహాద్ ఈవెంట్స్‌కు హాజరు కావట్లేదన్న అనుమానాలు బలపడుతున్నాయి.
రెమ్యూనరేషన్ కారణమా?
రెమ్యూనరేషన్ విషయంలో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప’ షూటింగ్ సమయంలోనే ఫహాద్ పాత్రకు సంబంధించి రెండు పార్ట్స్ ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ‘పుష్ప’ రిలీజ్‌కు ముందు వరకు ఫహాద్‌కు పెద్దగా మార్కెట్ లేదు. దీంతో అప్పటి డిమాండ్‌కు అనుగుణంగా మైత్రి మూవీ మేకర్స్ ఒక రేటు ఫిక్స్ చేసింది. అయితే ‘పుష్ప’ తర్వాత ఫహాద్ మార్కెట్ భారీగా పెరిగింది. కమల్ హాసన్, రజనీకాంత్ స్టార్ హీరోలతో ‘విక్రమ్’, ‘వేట్టయాన్’ వంటి బ్లాక్ బాస్టర్స్ చేశాడు. ఇటీవల ‘ఆవేశం’తో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ నటుడిగా మారిపోయాడు. దీంతో ‘పుష్ప 2’ చిత్రానికి 2021లో ఫిక్స్ చేసిన రెమ్యూనరేషన్ కాకుండా ఇప్పటి మార్కెట్‌ను బట్టి పారితోషికాన్ని ఫహాద్ కోరినట్లు సమాచారం. ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారమే చెల్లిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ తేల్చి చెప్పిందని కూడా ఓ వార్త ప్రచారంలో ఉంది. ఓ వైపు అల్లు అర్జున్‌కు రూ.300 కోట్లు ఇచ్చి, తనకు మాత్రం తక్కువ ఇస్తున్నారన్న భావన ఫహాద్‌లో బలంగా పడిపోయిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ‘పుష్ప 2’ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటున్నాడని అభిప్రాయపడుతున్నారు.
షూటింగ్స్ విషయంలోనూ..
ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) గత మూడేళ్లుగా చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ‘పుష్ప 2’ డేట్స్ ఇచ్చేశాడు. అయితే అనూహ్యంగా ‘పుష్ప 2’ అనేక సార్లు వాయిదా పడటం కూడా ఫహాద్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందని అంటున్నారు. పదే పదే షూటింగ్ వాయిదా పడటం వల్ల ఫహాద్ ఇచ్చిన డేట్స్ పూర్తిగా నిర్విర్యం అయిపోయినట్లు సమాచారం. మళ్లీ కొత్త డేట్స్ ఇవ్వాల్సి వచ్చినప్పడల్లా అప్పటికే ఒప్పుకున్న మరో చిత్రం డేట్స్ క్లాష్ అయ్యేవని టాక్. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ వద్దకు ఫహాద్ తీసుకెళ్లినప్పటికీ పెద్దగా రెస్పాన్స్ లేదని తెలుస్తోంది. దీంతో ఈ విషయంపై బహిరంగంగానే సన్నిహితులతో చెప్పుకొని ఫహాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడని ఫిల్మ్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
‘పుష్ప వల్ల ఒరిగిందేం లేదు’
ఈ ఏడాది మేలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప’పై ఫహాద్ ఫాజిల్ ఓపెన్ గానే తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పట్లో ఆ కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పుష్ప తర్వాత పాన్ ఇండియా యాక్టర్‌గా మారారని కాంప్లీమెంట్స్ వస్తున్నాయి.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని యాంకర్ ప్రశ్నించగా దానికి ఈ మలయాళ హీరో ఇచ్చిన ఆన్సర్ అందరినీ షాక్‌కి గురి చేసింది. ‘పుష్ప సినిమా నా కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. ఈ విషయం సుకుమార్ సార్‌కి కూడా చెప్పాను. ఇందులో నేనేం దాచడం లేదు. అలా అని అబద్దం కూడా చెప్పట్లేదు. ఆ సినిమా తర్వాత నేను ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించాను. మలయాళం భాష తెలియని వాళ్ళు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అదొక్కటే నాకు ఆనందాన్ని కలిగించింది’ అని స్పష్టం చేశాడు. ‘పుష్ప’ లాంటి పాన్ ఇండియా సినిమా వల్ల తనకు ఎలాంటి లాభం చేకూరలేదని ఫహద్ ఫాజిల్ చెప్పడం అప్పట్లో ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరిచింది.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి