• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొరఢాతో కొట్టుకున్న రాహుల్‌ గాంధీ

    తెలంగాణలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్‌….కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. పిల్లలతో సరదాగా గడుపుతూ, కళాకారులతో నృత్యాలు చేస్తున్నారు. రుద్రారంలోని గణేశ్‌ ఆలయం నుంచి యాత్ర ప్రారంభించారు. గిరిజన కళాకారులతో కలిసి థింసా నృత్యం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా స్టెప్పులేశారు. పోతురాజుల మాదిరిగా రాహుల్‌ గాంధీ కూడా [కొరఢా](url)తో కొట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమవుతూ సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర #BharatJodoYatra #RahulGandhi #Bonalu … Read more

    విరాట్‌ది ఫేక్‌ ఫీల్డింగ్‌

    భారత్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో కొన్ని చర్చనీయాంశమయ్యాయి. విరాట్‌ కోహ్లీ ఫేక్‌[ ఫీల్డింగ్‌](url) చేశాడంటూ బంగ్లా బ్యాటర్‌ నూరుల్‌ హసన్‌ ఆరోపించాడు. అప్పుడు పెనాల్టీగా ఐదు పరుగులు ఇచ్చి ఉంటే మ్యాచ్‌ పరిస్థితి వేరేలా ఉండేదన్నాడు. వర్షం అంతరాయానికి ముందు లిటన్‌ దాస్‌ డ్రైవ్‌ చేసిన బంతిని అర్షదీప్‌ త్రో చేశాడు. మధ్యలో ఉన్న విరాట్‌ చేతిలో బంతి లేకముందే విసిరినట్లు నటించాడు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమన్నాడు. ఇక లిటన్‌ దాస్‌ క్యాచ్‌, దినేశ్‌ కార్తీక్‌ రనౌట్‌పై కూడా చర్చ జరుగుతోంది. Dear @ICC … Read more

    రుణపడి ఉంటానన్న రంభ

    రోడ్డు ప్రమాదానికి గురైన తన కుమార్తె కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హీరోయిన్‌ రంభ కృతజ్ఞతలు తెలిపారు. “ మెుదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌ [లైవ్‌](url)లోకి వచ్చాను. నాకోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ రుణపడి ఉంటాను. ప్రస్తుతం నా కుటుంబం, కుమార్తె సాషా క్షేమంగా ఉంది. తనను ఇంటికి తీసుకువచ్చాం. మాపై ఇంత ప్రేమ చూపించినందుకు ఆనందంగా ఉంది. మీ దీవెనలు ఇలాగే కొనసాగాలి” అని రంభ అన్నారు. View this post on Instagram A post shared … Read more

    బాలయ్య…మజాకా !

    అన్‌స్టాపబుల్‌ సిరీస్‌తో బాలకృష్ణ దుమ్ములేపుతున్నారు. తన షోకు వచ్చిన వారిని సరదా ప్రశ్నలతో ఆటపట్టిస్తున్నారు. ఈసారి హీరోలు శర్వానంద్‌, అడవి శేష్‌లు రాగా వారితో ఓ ఆట ఆడుకున్నారు. రష్మిక తన క్రష్‌ అని ఓ ఎపిసోడ్‌లో చెప్పటంతో..శర్వా ఆమెతో వీడియో కాల్‌ మాట్లాడించారు. డబుల్‌ మీనింగ్‌ జోకులు వేసి కవర్‌ చేసేందుకు ప్రయత్నించిన శర్వానంద్‌కు. ఇవన్నీ బీ సెంటర్‌ తెలివితేటలంటూ చుక్కలు చూపించారు. ఇలాంటి ఎన్నో సరాదా సంభాషణలతో రిలీజ్‌ చేసిన [ప్రోమో](url) ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

    సమంతకు వచ్చింది ఆ వ్యాధేనా !

    మయోసైటిస్‌లో వివిధ రకాలు ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. హీరోయిన్‌ సమంతకు వచ్చింది సింగిల్‌ మయోసైటిస్‌ వ్యాధి అని భావిస్తున్నట్లు డాక్టర్‌ విజయ్‌ భాస్కర్‌ చెబుతున్నారు. ఆమె త్వరగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. పాలిమయోసైటిస్‌ అయితే కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఏర్పడుతోందని వివరించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయటం ద్వారా నయం చేయవచ్చని చెప్పారు. వ్యాధి తగ్గటానికి సమయం పడుతుందని వెల్లడించారు.

    మయోసైటిస్‌ త్వరగా నయం కాదు

    మయోసైటిస్‌ వ్యాధి త్వరగా నయం కాదని సన్‌ స్పిరిచ్యువల్‌ వ్యవస్థాపకులు విక్రమాదిత్య అన్నారు. ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 మయోసైటిస్‌ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. జీవన విధానాల మార్పుల కారణంగానే ఈ వ్యాధి సోకుతుందని వెల్లడించారు. అతిగా శారీరక శ్రమ చేయటంతో పాటు ఆహారపు అలవాట్ల కారణంగా మయోసైటిస్‌ సోకే ప్రమాదం ఉందని విక్రమాదిత్య తెలిపారు. హీరోయిన్‌ సమంత ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు.

    కింగ్‌ కోహ్లీ అసహనం

    ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లీ గదిని కొందరు [వీడియో](url) తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీనిపై విరాట్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇది చాలా భయానకమన్నాడు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్లేనని పేర్కొన్నాడు. అభిమానులు ఇష్టమైన ఆటగాళ్లను కలిసినప్పుడు ఆనందపడతారు కానీ, ఇది సరికాదన్నాడు. వీడియో చూసి షాక్‌ అయ్యానని,ఇలాంటి అభిమానాన్ని అంగీకరించనని వెల్లడించాడు. ప్రతి ఒక్కరి స్వేచ్ఛను గౌరవించాలని కోహ్లీ సూచించాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)

    రోడ్డు పక్కన ఆహారం విక్రయిస్తున్న దాబా క్వీన్‌

    సింగపూర్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసిన ఓ అందమైన యువతి రోడ్డు పక్కన ఆహారం విక్రయిస్తోంది. పంజాబీకి చెందిన అమన్‌ హుండల్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఎవరిదగ్గర పనిచేయకుండా సొంతకాళ్లపై నిలబడేందుకు వంటలు చేసి అమ్ముతోంది. ఉదయం 6 గంటలకు ఆహారం వండటం ప్రారంభించి 11 గంటలకు పూర్తి చేస్తానని చెప్పింది. పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణానికి హాని చేయని ప్లేట్లు వినియోగిస్తున్నట్లు అమన్‌ వెల్లడించింది.

    రాహుల్‌ గాంధీ ‘పరుగో పరుగు’

    వీలు చిక్కినప్పుడల్లా హుషారుగా ఉండే రాహుల్‌ గాంధీ..భారత్‌ జోడో యాత్రలోనూ అదే ఉత్సాహం కనబరుస్తున్నారు. తెలంగాణలో ఐదోరోజు కొనసాగిన పాదయాత్రలో తనను కలిసేందుకు వచ్చిన చిన్నారులతో కలిసి పరిగెత్తారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు తీశారు. రాహుల్‌ ఉన్నపలంగా పరిగెత్తటంతో ఏమవుతుందో తెలీక భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు. ఆయన వెంబడి పరుగులు తీశారు. చిన్నారులతో సరదాగా చేశారని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. Out for a marathon, but let's sprint! ?‍♂️#BharatJodoYatra pic.twitter.com/d7GIbYQXXA — Bharat Jodo (@bharatjodo) October … Read more

    వేగంగా నడవాలనుకుంటే ఈ షూపై లుక్కేయండి !

    నడక వేగం 250 శాతం పెంచే షూను అమెరికాకు చెందిన షిఫ్ట్‌ రోబోటిక్స్‌ సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోంది. మూన్‌వాకర్స్‌ పేరుతో ఈ షూను విడుదల చేస్తోంది. స్కేటింగ్‌ చేసే విధంగా కనిపించేలా వీటిని రూపొందించారు. వీల్స్‌ను అమర్చటంతో పాటు మెట్లు ఎక్కి దిగే సమయంలో అవి ఆగిపోయేవిధంగా ఏర్పాటు చేశారు. ఆర్టీఫియల్‌ ఇంటిలిజెన్స్‌, అల్గారిథమ్‌ ద్వారా పనిచేసేలా తీర్చిదిద్దారు. ఈ బూట్లతో అత్యంత వేగంగా నడవొచ్చని సంస్థ ప్రతినిధి తెలిపారు. వీటి ధర రూ. 1.15 లక్షలుగా నిర్ణయించారు. #Moonwalkers, the world’s fastest … Read more