• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేగంగా నడవాలనుకుంటే ఈ షూపై లుక్కేయండి !

    నడక వేగం 250 శాతం పెంచే షూను అమెరికాకు చెందిన షిఫ్ట్‌ రోబోటిక్స్‌ సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోంది. మూన్‌వాకర్స్‌ పేరుతో ఈ షూను విడుదల చేస్తోంది. స్కేటింగ్‌ చేసే విధంగా కనిపించేలా వీటిని రూపొందించారు. వీల్స్‌ను అమర్చటంతో పాటు మెట్లు ఎక్కి దిగే సమయంలో అవి ఆగిపోయేవిధంగా ఏర్పాటు చేశారు. ఆర్టీఫియల్‌ ఇంటిలిజెన్స్‌, అల్గారిథమ్‌ ద్వారా పనిచేసేలా తీర్చిదిద్దారు. ఈ బూట్లతో అత్యంత వేగంగా నడవొచ్చని సంస్థ ప్రతినిధి తెలిపారు. వీటి ధర రూ. 1.15 లక్షలుగా నిర్ణయించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv