• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Ayodhya Ram Mandir: చిరంజీవి, రామ్‌చరణ్‌కు రాముడంటే ఎంత భక్తో చూడండి!

  వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని చేతుల మీదుగా రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం పులకరించిపోయింది. ఈ మహత్కార్యానికి దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పరవశించిపోయారు. 

  మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభం కాగా ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. అనంతరం రామలల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. సరిగ్గా 12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్ మోహన్‌ భాగవత్‌ పాల్గొన్నారు.

  ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ రామ్‌లల్లాకు తొలి హారతి ఇచ్చారు. తర్వాత రాముడి పాదాలను తాకి సాష్టాంగ నమస్కారం చేశారు. అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీకాంత దీక్షితులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. 

  రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ క్రతువు జరుగుతున్న క్రమంలో రామమందిరంపై హెలికాఫ్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ అద్భుత దృశ్యాలను చూస్తూ భక్తులు పులకరించిపోయారు. తమ సెల్‌ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. 

  అయోధ్యలో సినీతారల సందడి

  రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు సినీతారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రామజన్మభూమి ట్రస్టు ఆహ్వానం మేరకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో పాల్గొని తరించారు. 

  రజనీకాంత్‌

  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajani Kanth) సంప్రదాయ దుస్తుల్లో రామమందిరానికి విచ్చేసి ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యారు. ఆలయంలోకి విచ్చేసిన రజనీకాంత్‌కు రామజన్మభూమి ట్రస్టు ప్రతినిధులు స్వాగతం పలికారు. 

  మెగాస్టార్‌ చిరంజీవి

  బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi) కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చిరుతో పాటు ఆయన భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌ (Ram Charan) హాజరయ్యారు. గ్యాలరీలో కూర్చున్న వారిని పీటీ ఉష మర్యాదపూర్వకంగా కలిశారు. 

  పవన్‌ కల్యాణ్‌

  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సైతం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముడి ఆశీర్వచనాలు అందుకున్నారు. అంతకుముందు జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్‌.. ఆయోధ్య రామమందరి ప్రతీ భారతీయుడి కల అని అన్నారు. అది ఇవాళ సాకారం కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

  అమితాబ్‌ బచ్చన్‌

  బాలీవుడ్‌ ప్రముఖుడు అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) తన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan)తో కలిసి రామజన్మభూమికి విచ్చేసారు. ఆలయ నిర్వాహకులతో పాటు మాజీ కేంద్రమంత్రి రవిశంకర్‌ వారికి స్వాగతం పలికారు.

  రణ్‌బీర్‌ & ఆలియా భట్‌

  బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), ఆలియా భట్‌ (Alia Bhatt) రామమందిరానికి విచ్చేసి శ్రీరాముని సేవలో తరించారు. సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. 

  కత్రినా కైఫ్‌ కపుల్స్‌

  ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ (Katrina Kaif) తన భర్త విక్కీ కౌషల్‌ (Vicky Kaushal)తో కలిసి రామాలయానికి విచ్చేసింది. వారిద్దరు రణ్‌బీర్‌ దంపతులతో కలిసి ఈ రిక్షాలో ఆయోధ్య వీధుల్లో సందడి చేశారు.

  చంద్రబాబు నాయుడు

  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముడి ఆశీస్సులు తీసుకున్నారు. 

  రామమందిరం ప్రత్యేకతలు(Special features of Ram Mandir)

  ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యను రాముని జన్మస్థలంగా(Ram Lalla) హిందువులు భావిస్తారు. సుదీర్గ పోరాటం తర్వాత ఆగస్టు 5, 2020లో ప్రధాని మోదీ ఈ మందిరానికి భూమి పూజ చేశారు. విరాళాల ద్వారా ఆలయ నిర్మాణానికి రూ.2,100కోట్లు సమకూరినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రామమందిరానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన 10 అంశాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

  • అయోధ్య రామమందిరాన్ని 2.77 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇది పూర్తిగా సంప్రదాయ నగర రీతిలో రూపుదిద్దుకుంది. 57,400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఆలయం.. డిజైన్ స్ట్రక్చర్ ప్రకారం దేశంలోనే అతిపెద్ద ఆలయంగా అవతరించింది.
  • ఈ రామమందిరాన్ని మూడు అంతస్తులుగా నిర్మించారు. ఇది 360 అడుగుల పొడవు, వెడల్పు 253 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తును కలిగి ఉంది. 
  • మొదటి అంతస్తు నుంచి గర్భ గుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమైంది. ఒక్కొక్క అంతస్తు దాదాపు 20 అడుగులతో ఎత్తులో ఉంటుంది. 
  • రామమందరి స్థిరంగా, దృఢంగా ఉండటం కోసం 392 రాతిస్తంభాలు వినియోగించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 160, మెుదటి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 స్తంభాలను నిలబెట్టారు. 
  • ఈ ఆలయంలో మొత్తం ఐదు మండపాలు ఉంటాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపాలు ఉన్నాయి.
  • రామాలయంలోని మొత్తం గోడలు, స్తంభాల మీద అనేక రకాల దేవతమూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను చిత్రించారు.
  • మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు.. ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్‌, సిమెంట్‌, కాంక్రీటును వాడలేదు. యూపీ, గుజరాత్‌, రాజస్థాన్‌ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు.
  • రిక్టర్‌ స్కేల్‌పై 8కి పైగా తీవ్రతతో భూకంపాలు వచ్చినా, మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం 2,500 ఏండ్లపాటు ఆలయం వాటిని తట్టుకొనేలా డిజైన్‌ చేశారు.
  • వసుధైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించేలా.. ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని, 2,587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు.
  • ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్‌పై సూర్య కిరణాలు పడినట్లుగానే, రామమందిరంలోని బాల రాముడి విగ్రహంమీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv