• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ayodhya Ram Mandir: చిరంజీవి, రామ్‌చరణ్‌కు రాముడంటే ఎంత భక్తో చూడండి!

    వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని చేతుల మీదుగా రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం పులకరించిపోయింది. ఈ మహత్కార్యానికి దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పరవశించిపోయారు.  మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభం కాగా ప్రధాని … Read more

    ‘రామ మందిరం ప్రతిష్ఠ రోజు వారు రావొద్దు’

    అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిరం ప్రతిష్ఠ కార్యక్రమానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు రావొద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కోరింది. వారికి తగిన ఏర్పాట్లు చేయలేమని, అధికారులు సైతం ప్రొటోకాల్ పాటించే పరిస్థితి ఉండదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులను విడతల వారీగా ఆహ్వానించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జనవరి 26 తర్వాత భారత్‌తో పాటు విదేశాల్లోని భక్తులకు సైతం అవకాశం కల్పిస్తామన్నారు.

    పవిత్రమైన నదిలో రీల్స్.. నెటిజన్స్ ఫైర్

    అయోధ్యలోని సరయు నదిలో ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పవిత్రమైన నదిలో ఇలాంటి పనులు చేయడమేంటని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అయోధ్య పోలీసులు స్పందించారు. అయోధ్య ఇన్‌స్పెక్టర్ ఆదేశాలతో విచారణ చేస్తున్నామని, మహిళపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు. గతంలోనూ ఈ నదిలో ఓ బాలిక డ్యాన్స్ చేయగా ఆమెపై చర్యలు తీసుకున్నారు. #अयोध्या :राम की पैड़ी में रील बनाते एक … Read more

    అయోధ్య రామమందిరం; పిక్స్ వైరల్

    యూపీలోని అయోధ్యలో చేపట్టిన రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మందిరాన్ని నాగారా శైలిలో నిర్మిస్తున్నారు. తాజాగా గర్భగుడికి సంబంధించిన ఫొటోలను తొలిసారిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ గర్భగుడిలో కొలువుదీరే ప్రధాన విగ్రహాలను చెక్కేందుకు నేపాల్ నుంచి రాళ్లను తెప్పించారు. వచ్చే ఆగష్టు నాటికి గర్భగుడి పనులు పూర్తి కానున్నాయి. Courtesy Twitter: champathrai Courtesy Twitter: champatrai

    స‌ర‌యు న‌దిలో భార్య‌కు ముద్దు పెట్టినందుకు భ‌ర్త‌ను చిత‌క్కొట్టారు

    కొత్త‌గా పెళ్ల‌యిన ఒక జంట అయోధ్య‌లోని స‌ర‌యు న‌దిలో స్నానం చేస్తూ ముద్దు పెట్టుకున్నందుకు కొంత‌మంది భ‌ర్త‌ను చిత‌క్కొట్టారు. న‌దిలో స్నానం చేస్తూ చుట్టు జ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ భ‌ర్త‌, భార్య‌ను ముద్దు పెట్టుకోబోయాడు. ఇది గ‌మ‌నించిన వ్య‌క్తులు భ‌ర్త‌ను ప‌క్క‌కు లాగి కొట్ట‌డం ప్రారంభించారు. ఆమె ఆపేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా అది సాధ్యం కాలేదు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు రాక‌పోవ‌డంతో కేసు న‌మోదు చేయ‌లేద‌ని అయోధ్య సీనియ‌ర్ సూప‌రిండెంట్ శైలేష్ పాండే వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆ దంపతులు ఎక్క‌డ ఉన్నారో తెలుసుకునేందుకు … Read more