పీఎం మోదీ 21 ఫారిన్ టూర్స్; ఖర్చు ఎంతంటే?
ప్రధాని నరేంద్ర మోదీ 2019 నుంచి 21 విదేశీ పర్యటనలు చేశారు. ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ.22.76 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విదేశాంగశాఖ మంత్రి విదేశీ పర్యటనల కోసం రూ. 20.87 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఏకంగా 86 విదేశీ పర్యటనలు చేశారు. కాగా ప్రధాని విదేశీ టూర్ల ఖర్చు ఎంత అని ప్రతిపక్షాలు రాజ్యసభలో ప్రశ్నించాయి. దీనికి సమాధానంగా విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వివరాలు వెల్లడించారు.