• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోదీ వైఖరిపై కాంగ్రెస్ అసంతృప్తి

    ఇజ్రాయెల్‌-పాలస్తీనాల సంక్షోభంపై భారత వైఖరిని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఈ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీరు మొదటి నుంచి భిన్నంగా ఉందని చెప్పింది.‘పాలస్తీనా హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటానికి భారత్‌ మద్దతుగా నిలిచేది. దాడుల విషయానికొస్తే వాటిని తీవ్రంగా ఖండించేంది. ప్రస్తుతం భారత వైఖరి మాత్రం యుద్ధానికి ముగింపు పలికేలా లేదు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా విషయంపై భారత్‌ తన వైఖరిని హుందాగా, గౌరవప్రదమైన రీతిలో వెల్లడించాలి’అని కాంగ్రెస్ పేర్కొంది.

    నేడు ప్రధాని మోదీతో టీబీజేపీ నేతల కీలక భేటీ

    నేడు ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ నేతలు కీలక భేటీ కానున్నారు. ఇప్పటికే తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో రాష్ట్ర నేతల ప్రత్యేక భేటీలు నిర్వహించనున్నారు. తెలంగాణలో రూట్ మ్యాప్, అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరపనున్నారు. అన్ని కుదిరితే ఇవాళ రాత్రికే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

    ఆసుపత్రిపై దాడి: మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

    గాజాలో ఆసుపత్రి దాడి ఘటనపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్ అహ్లీ ఆసుపత్రిలో ప్రాణనష్టంపై బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న ఘర్షనల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆసుపత్రిపై దాడిలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

    దేశ శాస్త్రవేత్తలకు మోదీ దిశానిర్ధేశం

    భారత దేశ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. రాబోయే 20 ఏళ్లలో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపారు. 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడు అడుగు పెట్టేలా లక్ష్యం పెట్టుకోవాలని దిశానిర్ధేశం చేశారు. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 విజయాలు అందించిన ఉత్సాహంతో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని శాస్త్రవేత్తలకు సూచించారు. శుక్రగ్రహంపై ఆర్భిటర్ మిషన్, అంగారకుడిపై ల్యాండర్ వంటి ప్రయోగాల దిశగా శాస్త్రవేత్తలు కృషి చేయాలని మోదీ వెల్లడించారు.

    2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నాం: మోదీ

    2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ తరఫున అన్ని విధాల కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. 141 కోట్ల భారతీయులు ఒలింపిక్స్ క్రీడల కోసం ఉత్సాహంగా ఉన్నారని స్పష్టం చేశారు. 2029లో యూత్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐఓసీ- జియో కన్వెన్షన్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ అన్ని రంగాలతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటుతోందని గుర్తు చేశారు.

    ఈ ప్రాంతాలను తప్పక సందర్శించాలి: మోదీ

    ఉత్తరాఖండ్‌లో పుణ్యక్షేత్రాలను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పవిత్ర క్షేత్రాల జాబితాను షేర్‌ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలనైనా కచ్చితంగా సందర్శించాలని దేశ పౌరులను ప్రధాని కోరారు. రాష్ట్రంలోని పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను సందర్శించడం ఎంతో ప్రత్యేకమన్నారు. ‘కుమావోన్‌ ప్రాంతంలోని పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను తప్పక సందర్శించాల్సిందిగా కోరుతాను. ఎన్నో ఏళ్ల తర్వాత పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను సందర్శించడం నాకెంతో ప్రత్యేకం’’ అని ప్రధాని పేర్కొన్నారు.

    ఘర్షణలతో ప్రయోజనం ఉండదు: మోదీ

    జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న వివాదాలు, ఘర్షణలతో ఎవరికి ప్రయోజనం ఉందని చెప్పారు. శాంతికి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయమని చెప్పారు. ‘మానవ అవసరాలను తీర్చే విషయంలో అందరం కలిసి గట్టుగా పనిచేయాలి. సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ ఎదుర్కొంటుంది. ఉగ్రదాడిలో వేల మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉగ్రవాదం ఎక్కడున్న ఏ రూపంలో ఉన్న అది మానవాళికి వ్యతిరేకం’ అని మోదీ స్పష్టం చేశారు.

    మా మద్దతు వారికే: మోదీ

    ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకమని అది ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని తెలిపారు. ఈ క్లిష్టమైన పరిస్థితిలో ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తామని చెప్పారు. హమాస్ ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కు భారత్ తోడుగా నిలుస్తోందని ప్రధాని భరోసా ఇచ్చారు.

    నేడు అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ

    ఏషియన్‌ గేమ్స్‌ అథ్లెట్లతో నేడు ప్రధాని మోదీ భేటీ కానున్నారు. మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో మోదీ సంభాషించనున్నారు. అటు ఏషియన్ గేమ్స్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ గేమ్స్‌లో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది.

    మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్

    పాలమూరు ప్రజాగర్జన’ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు..BRS పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉంది. కానీ బిజెపి స్టీరింగ్..అదాని చేతిలోకి వెళ్లిపోయింది. తెలంగాణలో రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం… మిలియన్ డాలర్ జోక్’. అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.