• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NaMo Bharat Rail: గంటకు 160 కి.మీల వేగంతో దూసుకెళ్లే తొలి లోకల్‌ ట్రైన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే షాకే!

    దేశంలో తొలి ర్యాపిడ్‌ఎక్స్‌ (RAPIDX) రైలు పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. రేపు (శుక్రవారం) ఈ తొలి ప్రాంతీయ హైస్పీడ్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇవి అచ్చం మెట్రో రైలులాగా తమ సేవలను అందిస్తాయి. దిల్లీ-ఘజియాబాద్‌ రీజనల్‌లోని సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ఈ RAPIDX రైళ్లు ప్రయాణించనున్నాయి. గంటకు 160కి.మీల వేగంతో ఈ ర్యాపిడ్‌ఎక్స్‌ రైళ్లు దూసుకెళ్లనున్నాయి. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తర్వాత కేంద్రం తీసుకొస్తున్న మరో హైస్పీడ్‌ ప్రాంతీయ రైలు (High Speed Local Train) ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ రైలు ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం. 

    అధునాతన సౌకర్యాలు

    NaMo Bharat రైళ్లు పూర్తిగా ఎయిర్‌ కండిషన్డ్‌. ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని వీటిలో అనేక ఫీచర్లు ఏర్పాటు చేశారు. ప్రతి రైలులో 2×2 లేఅవుట్‌లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్‌ ర్యాక్‌లు ఏర్పాటు చేశారు.

    సీసీటీవీ కెమెరాలు

    ప్రయాణికుల భద్రతకు NaMo Bharat రైళ్లలో పెద్దపీట వేశారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ఎమర్జెన్సీ డోర్‌ ఓపెనింగ్‌ మెకానిజాన్ని రైలుకు అందించారు. అలాగే ల్యాప్‌టాప్‌ లేదా మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, డైనమిక్ రూట్‌ మ్యాప్‌లు, ఆటో కంట్రోల్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, హీటింగ్ వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ (HVAC) సదుపాయాలు ఈ రైలులో ఉన్నాయి.

    1700 మంది ప్రయాణం

    ప్రతి NaMo Bharat రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి. ఏకకాలంలో 1700 మంది కూర్చొని, నిలబడి ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. స్టాండర్డ్‌ కోచ్‌లో 72 సీట్లు, ప్రీమియం కోచ్‌లో 62 సీట్లు చొప్పున ఈ రైలులో ఉంటాయి.

    ఆ రూట్ల మధ్య ప్రయాణం

    NaMo Bharat రైళ్ల సేవలు అక్టోబర్‌ 21 నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. దిల్లీ – ఘజియాబాద్ – మీరట్ RRTS కారిడార్‌లోని 17కిమీ పొడవైన సాహిబాబాద్ – దుహై డిపో మధ్య ఐదు స్టేషన్ల (సాహిబాబాద్‌, ఘజియాబాద్‌, గుల్దర్‌, దుహై, దుహై డిపో) మీదుగా ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

    టికెట్‌ ఎంతంటే?

    NaMo Bharat ట్రైన్‌లోని స్టాండర్డ్‌ కోచ్‌ల కనీస టికెట్‌ ధరను రూ.20గా రైల్వే శాఖ నిర్ణయించింది. గరిష్ఠ ధర రూ.50గా పేర్కొంది. అలాగే, ప్రీమియం కోచ్‌లలో అయితే కనీస టికెట్‌ ధర రూ.40 కాగా, గరిష్ఠ ధర రూ.100గా ఉంది.

    స్త్రీలకు ప్రత్యేక కోచ్‌

    ప్రతి ర్యాపిడ్‌ఎక్స్‌ రైలులో ఒక కోచ్‌ను మహిళల కోసం రిజర్వు చేశారు. ఇది ప్రీమియం కోచ్‌ పక్కనే ఉండేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతి కోచ్‌లోనూ మహిళలు, ప్రత్యేక అవసరాలు కలిగినవారు, సీనియర్‌ సిటిజన్లకు సీట్లను రిజర్వు చేశారు. 

    విలాసవంతమై సీట్లు

    RAPIDX రైలు ప్రీమియం కోచ్‌లో వెనుకకు వాలి కూర్చొనే సీట్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు కోట్ హుక్స్, మ్యాగజైన్ హోల్డర్‌లు, ఫుట్‌రెస్ట్‌లు వంటి అదనపు ఫీచర్లను అందించారు. మీరట్‌ నుంచి దిల్లీకి వెళ్లే తొలికోచ్‌, దిల్లీ నుంచి మీరట్‌ వెళ్లే ఆఖరి కోచ్‌ ప్రీమియం కోచ్‌ కానుంది. ప్రీమియం కోచ్‌లోని ప్రయాణికులకు సహాయపడేందుకు ఒక అసిస్టెంట్‌ కూడా ఉంటారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv