ప్రస్తుతం యావత్ దేశం ఆసక్తికగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గ్లోబల్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, AI సాయంతో ఆలోచించే మెషీన్.. ‘బుజ్జి’గా కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి కథానాయిక కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ అందించారు. అసలు భైరవ, బుజ్జి ఎవరు? ఎలా కలిశారు? అన్న పాయింట్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు కల్కి టీమ్ వినూత్న ఆలోచన చేసింది. ‘బుజ్జి అండ్ భైరవ’ (Bujji And Bhairava Review) పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో యానిమేటెడ్ సిరీస్‌ను విడుదల చేసింది. తొలిగా రెండు ఎపిసోడ్లు విడుదల అయ్యాయి. మరో రెండు ఎపిసోడ్లు సినిమా రిలీజ్ అయ్యాక విడుదల చేయనున్నారు. మరి ఇప్పుడు రిలీజ్ అయిన రెండు ఎపిసోడ్స్‌లో ఏం ఉంది? బుజ్జి, బైరవ పాత్రలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
బుజ్జి ఎవరో తెలుసా?
బుజ్జికి సంబంధించిన సమాచారాన్ని ఈ యానిమేటెడ్ సిరీస్‌లో క్లుప్తంగా చూపించారు. BU – JZ – 1 అనే కోడ్ నేమ్ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైజ్‌యే బుజ్జి. ఈ డివైస్‌ను ఒక శక్తివంతమైన షిప్‌కు కనెక్ట్ చేయడం సిరీస్‌లో చూపించారు. ఆ షిప్ 99 మిషన్లను విజయవంతంగా పూర్తి చేసి 100వ మిషన్‌లో ఉండగా దానిపై దాడి జరుగుతుంది. వెహికిల్ నాశనం అయిపోయి గ్లింప్స్‌లో చూపించిన ప్రధాన డివైస్ మాత్రం మిగులుతుంది. ఈ దాడితో కాంప్లెక్స్ (గ్లింప్స్‌లో చూపించిన పెద్ద ట్రయాంగిల్)కి షిఫ్ట్ అయిపోవాలన్న బుజ్జి కల చెల్లాచెదురైపోతుంది. అయితే ఈ చిన్న డివైస్‌ను ప్రభాస్ మొట్టమొదటిసారి చూసినప్పుడు దానిపై BU – JZ – 1 కోడ్ నేమ్ మొత్తాన్ని కలిపి ‘బుజ్జి’ అని చదువుతాడు. అలా దానికి బుజ్జి అనే పేరు ఫిక్స్ అవుతుంది.
క్రేజీగా భైరవ పాత్ర?
బుజ్జిలాగానే భైరవ (ప్రభాస్) కూడా కాంప్లెక్స్‌కి షిఫ్ట్ అయిపోవాలని కలలు కంటుంటాడు. కానీ, దానికి ఒక మిలియన్ యూనిట్స్ (క్రిప్టో కరెన్సీలాంటిది) అవసరం అవుతాయి. యూనిట్స్ అనేది 2898 నాటి ఇండియన్ కరెన్సీ. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు భైరవ డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఈ సిరీస్‌లో భైరవ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది చూపించలేదు. భైరవ ఉండే ఇంటి ఓనర్‌గా బ్రహ్మానందం కనిపించడం విశేషం. రెండు ఎపిసోడ్‌ల సిరీస్‌లో బ్రహ్మానందం, ప్రభాస్‌ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. మరి బ్రహ్మానందం సినిమాలో ఉంటారో లేదో చూడాలి.
శంభల నగరం
మహా విష్ణువు పదో అవతారమైన కల్కి… శంభల నగరంలో పుడతాడని మన పురాణాల్లో ఉంది. దీనికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఈ సిరీస్‌లో చూపించారు. కాంప్లెక్స్‌కు వెళ్తున్న వెహికిల్స్‌పై శంభల సిటీకి చెందిన రెబల్స్ దాడి చేసి అందులో ఆహారాన్ని కొల్లగొడతారు. శంభల సిటీలో పిల్లలకు కనీసం ఆహారం కూడా లేదని వీరి మాటల్లో వివరిస్తారు. ఈ రెబల్స్‌లో ఒకరు సినిమా గ్లింప్స్‌లో చూపించిన పశుపతిలా కనిపిస్తారు. దీన్ని బట్టి పశుపతి పాత్ర శంభల నగరానికి సంబంధించిన రెబల్ అనుకోవచ్చు.
కల్కి- భైరవ వేర్వేరు పాత్రలా!
మన పురాణాల ప్రకారం కల్కి శంభల నగరంలో పుడతారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర కాశీ నగరంలో ఉంటుంది. భైరవ పాత్ర బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చిన్నప్పుడు శంభల నగరంలో పుట్టి తర్వాత భైరవ కాశీ నగరానికి వస్తాడా? లేకపోతే కల్కి పాత్ర అవతారానికి భైరవ సాయం చేస్తాడా? ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలపై కల్కి సినిమాలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.
సిరీస్ స్టోరీ ఏంటి?
కల్కి సినిమా మెుదలయ్యే రెండేళ్ల కాలానికి ముందు కథ జరుగుతుంది. చాలా సంవత్సరాలుగా కార్గో వెహికల్‌లో పనిచేసే ఏఐ మెషీన్ బుజ్జికి ప్రమోషన్ వస్తుంది. కాంప్లెక్స్ మెంబర్ అయిన వ్యక్తికి ప్రైవేటు వెహికల్ కావడానికి సిద్ధమవుతుంటుంది. ఈ క్రమంలో చివరి కార్గో డెలివరీ చేయడానికి వెళ్తుండగా రెబల్స్ అటాక్ చేసి, ఆ షిప్‌ను కూల్చేస్తారు. దీంతో బుజ్జికి కాంప్లెక్స్ సిటీతో కనెక్షన్ కట్ అయిపోయి స్క్రాప్‌లోకి వెళ్లిపోతుంది. మరోవైపు కాశీ పట్టణంలోని చిల్లర దొంగతనాలు చేసే భైరవ (ప్రభాస్) కూడా కాంప్లెక్స్‌లో మెంబర్ కావాలని అనుకుంటాడు. దొంగలను పట్టుకునే క్రమంలో ఓ బైక్ ముక్కలైపోవడంతో దాన్ని స్క్రాప్‌నకు వేసేందుకు తీసుకెళ్తాడు. అక్కడే భైరవకు బుజ్జి పరిచయం అవుతుంది. బుజ్జి ఆలోచనతో భైరవ ఓ స్పెషల్ కారును ఎలా తయారు చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సిరీస్ స్టోరీ.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్