• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత క్రికెట్ ముఖచిత్రమే మారిన రోజది!

    జూన్ 25 1983, టీమిండియా క్రికెట్ గమనాన్ని మార్చి తమ ఆగమనాన్ని చాటిన అద్భుతమైన రోజది. ఈ రోజును తలచుకుంటే క్రీడాభిమానుల్లో ఉత్తేజం ఉప్పొంగుతుంది. క్రికెటర్ల నరనరాల్లో స్ఫూర్తి రక్తం ప్రవహిస్తుంది. ఆట మొదలుపెట్టిన అర్ధశతాబ్దానికి తొలి ప్రపంచకప్ ను ముద్దాడిన మధుర గడియలవి. సవాళ్లకు ప్రతిసవాళ్లను విసురుతూ ఎంతో మంది భారతీయులను క్రికెట్ వైపు అడుగులేసేలా చేసిన క్షణాలవి. ఒక్కసారి ఆ రోజులను గుర్తుచేసుకుందాం. తొలి మ్యాచ్ ఆడిన 50 ఏళ్లకు సంచలన మ్యాచ్ ఇండియా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోజు … Read more

    ఫస్టాఫ్ బాక్సాఫీస్ బాద్‌షాలెవ‌రు? బోల్తా కొట్టిందెవరు?

    దర్శకధీరుడి సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్, బాక్సాఫీస్ దగ్గర డీజే టిల్లు బ్లాక్ బస్టర్ బరాత్,  అడివిశేష్ ‘మేజర్’ సూపర్ హిట్ ఆపరేషన్ ఒకవైపు.. ‘మెగా’ అంచనాలతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ‘ఆచార్య’ లాంటి సినిమాలు మరోవైపు… 2022 తొలి అర్ధభాగంలో తెలుగు సినిమా ప్రయాణం అనూహ్యంగా సాగింది. అంచనాలే లేకుండా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే…భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అలాగే ఆర్నెళ్లలో రెండే రెండు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లు వస్తే అందులో ఒకటి … Read more

    ‘లంగా వోణి’ వేడుకలో రిటర్న్ గిఫ్ట్స్

    దక్షిణాదిలో ‘లంగా వోణి’ వేడుకకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు లోగిళ్లలో అయితే దీనిని మరింత సంబరంగా జరుపుకుంటారు. ఓ పెళ్లి వేడుకకు ఏమాత్రం తీసిపోని విధంగా అలంకరణలు, హంగులూ, ఆర్భాటాలతో తమ గారాలపట్టి ‘లంగా వోణి’ ఫంక్షన్ గురించి నలుగురూ మాట్లాడుకునేలా నిర్వహిస్తారు. ఆడపిల్ల బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే వేళ..తమ చిట్టితల్లి పెద్దది అయ్యింది..పెళ్లి ఈడుకొచ్చిందని బంధుగణానికి చాటేందుకు ఒకప్పుడు ఈ వేడుక జరిపేవారు. ఇప్పుడు అంత చిన్న వయసులో పెళ్లి చేయకపోయినా…సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారాన్ని అలాగే కొనసాగిస్తున్నారు.  ఈ మధ్యకాలంలో … Read more

    ‘జెర్సీ’ మూవీ కాదు..అంతకుమించినది దినేశ్ కార్తిక్ జీవితకథ

    ఎమోషనల్ రోలర్ కోస్టర్ డ్రామా కథతో తెరకెక్కిన సినిమాకు ఏమాత్రం తీసిపోని జీవితం అతడిది. గుండెతరిగే ఆవేదన..గుండె ధైర్యాన్నిచ్చే పోరాటం. ఓ ప్రేమ, ఓ స్నేహం, అభిమానం, అవమానం, సంతోషం,దు:ఖం.. ఊహించని మలుపులు, అగాథం నుంచి ఆకాశానికి ఎగిసిన స్ఫూర్తి ఇది సినిమా కథ కాదు. దినేశ్ కార్తిక్ నిజజీవిత ప్రయాణం. రీల్ స్టోరీ ‘జెర్సీ’లో నానిని చూసి ఎంతో మంది కదిలిపోయారు. కానీ దినేేశ్ కార్తిక్ కథ అంతకు రెండింతల భావోద్వేగాలున్న రియల్ స్టోరీ. 37 ఏళ్ల వయసులో  టీ20ల్లో గ్రేట్ ఫినిషర్ … Read more

    కేసీఆర్ బాటలోనే మోదీ

    కేసీఆర్, మోదీ చాలా విషయాల్లో ఒకే రకంగా ఆలోచిస్తారని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. వారి రాజకీయ ప్రయాణం, పరిపాలనా విధానం కూడా దాదాపుగా అలాగే ఉంటుందని అభిప్రాయపడుతుంటారు. వీరిలో ఒకరిది అతి జాతీయవాదమైతే మరొకరిది అతి ప్రాంతీయవాదమని నిపుణుల విశ్లేషణ. అయితే ఎన్నికల వ్యూహాల్లోనూ వీరు ఒకేలా ఆలోచిస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తే తెలుస్తోంది. రానున్న ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ చేసిన ఆలోచననే మోదీ కూడా అమలుచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నియామకాలపై నిశ్శబ్ధం వీడి మోత మోగేలా కేసీఆర్ ప్రకటన:  ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్ … Read more

    విక్రమ్ దర్శకుడు ‘ది లోకేశ్ కనగరాజ్’ సినిమేటిక్ యూనివర్స్

    లోకేశ్ కనగరాజ్..! గుర్తుపెట్టుకోండి. ఈ పేరు ఇండియన్ సనిమాలో తనకంటూ ఓ పేజీ రాసుకుంటుంది. ‘గన్స్, డ్రగ్స్, బిర్యానీ, వన్ నైట్ స్టోరీ’ స్టైల్ తో ‘ఖైదీ’ సినిమా చూసినపుడే ఎంతోమంది లోకేశ్ కనగరాజ్ కు అభిమానులయ్యారు. ఒకేరాత్రిలో అద్భుతమైన కథని అదిరిపోయే స్క్రీన్ ప్లేతో లోకేశ్ తెరకెక్కించిన విధానం సినిమా మేకింగ్ స్థాయిని పెంచేలా ఉంటుంది. ఇప్పుడు ‘విక్రమ్’ చూశాక ఎంతో మంది అతడికి డైహార్డ్ ఫ్యాన్స్ అయ్యారు. విక్రమ్, ఖైదీని లింక్ చేస్తూ ఓ సినిమేటిక్ యూనివర్స్ కు లోకేశ్ కనగరాజ్ … Read more

    డ్రోన్ పైలట్ అవుతారా? ఇది తెలుసుకోండి

    డ్రోన్ల రంగం రోజురోజుకూ దూసుకుపోతోంది. ఫోటోలు తీయడం దగ్గర్నుంచి ఆర్మీలో ఆపరేషన్ల వరకూ డ్రోన్ల వినియోగం విస్తరించింది. దీంతో ఈ రంగంపై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. డ్రోన్ పైలట్లుగా ఎదిగేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతున్నారు. వారికి శిక్షణ అందించేందుకు అనేక సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అసలు డ్రోన్ ఫ్లయింగ్ అంటే ఏమిటి? మన దేశంలో డ్రోన్ల వినియోగ నిబంధనలేంటి? హైదరాబాద్ లో డ్రోన్ ఫ్లయింగ్ శిక్షణ సంస్థల వివరాలేంటి ఇవన్నీ ఈ ఆర్టికల్ లో చూద్దాం. డ్రోన్ ఫ్లయింగ్ అంటే ఏంటి? డ్రోన్లంటే … Read more

    ‘అంటే సుంద‌రానికి’ హీరోయిన్‌ న‌జ్రియా ఫ‌హాద్ గురించి ఆసక్తికర విషయాలు

    తెలుగులో నేరుగా ఒక్కసినిమా చేయకపోయినా కేవలం డబ్బింగ్ సినిమాలతోనే ఇక్క‌డ కూడా అభిమానులను సంపాదించుకున్న నటి నజ్రియా. ‘రాజా రాణి’ సినిమాలో తన అభినయంతో తెలుగు సినీ ప్రియుల హృదయంలో చోటు సంపాదించుకుంది. త‌న లుక్స్‌, ఎక్స్‌ప్రెష‌న్స్‌తో కుర్రాళ్ల హృద‌యాల‌ను దోచుకుంది. కానీ కెరీర్ మంచి స్పీడ్‌లో ఉండ‌గానే పెళ్లి చేసుకుని సినిమాలకు కొంత‌కాలం దూరమైంది. మళ్లీ చాలా రోజులకు నేరుగా తెలుగు సినిమాతో తన అభిమానులను పలకరించబోతోంది.  న‌జ్రియాకు ఇన్‌స్టాలో 5.7మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఆమె తెలుగులో చాలా పాపులర్ కాబోతుంద‌ని..బిజీగా మార‌బోతుంద‌ని … Read more

    స్మార్ట్ ఫోన్ అక్కర్లేదు ఇక మెదడులోనే చిప్!

    సాంకేతికత రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది. గత రెండు దశాబ్దాల కాలంలో కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. 2జీ నుంచి 5జీకి చేరుకుంది. ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు వచ్చింది. అయితే 2030 కల్లా ఈ స్మార్ట్ ఫోన్లకు కూడా కాలం చెల్లనుంది. ఇటీవల నోకియా సీఈఓ పెక్కా లండ్ మార్క్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మాట్లాడుతూ..2030 కల్లా 6జీ వచ్చేస్తుంది… అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు కూడా ఉండవు. అంతా మెదడు ద్వారానే కమ్యూనికేషన్ సాగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. … Read more

    Top 5 Acting Scenes of Vijay Devarakonda

    Rowdy Star Vijay Devarakonda known as the trendsetter in Tollywood. This star actor is known for his high adrenaline dialogues, Manly looks and magnificent performances. With cult-classic ‘Arjun Reddy’ he made his unremovable mark on Telugu Film Industry. Today this heartthrob celebrates his birthday. Let’s explore his best acting scenes for his catalog. Pelli Choopulu (2016) This Romantic-comedy was directed … Read more