• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Meter Review: మాస్‌ నటనతో అదరగొట్టిన కిరణ్‌ అబ్బవరం.. మరీ ‘మీటర్‌’ ప్రేక్షకులకు నచ్చిందా?

    నటినటులు: కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి, సప్తగిరి, పోసాని కృష్ణమురళి

    దర్శకత్వం: రమేష్‌ కడూరి

    సంగీతం: సాయి కార్తిక్‌

    నిర్మాత: చిరంజీవి, హేమలత పెదమల్లు

    యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోష్‌లో ఉన్నాడు. జయాపజాయలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కిరణ్‌ అబ్బవరం  రీసెంట్‌ మూవీ వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో కిరణ్‌ నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. ప్రస్తుతం ఆయన లెటేస్ట్‌ మూవీ మీటర్‌ ఇవాళ (ఏప్రిల్‌ 7) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి అంచనాలను కిరణ్ అబ్బవరం అందుకున్నాడా?. వరుసగా రెండో హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడా? అసలు సినిమా కథేంటి? వంటి ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానాలు చూద్దాం. 

    కథ ఏంటంటే:

    కథలోకి వెళితే… అర్జున్‌ కళ్యాణ్‌ (కిరణ్ అబ్బవరం) తండ్రి ఓ మంచి పోలీసు ఆఫీసర్‌. కానిస్టేబుల్‌గా చేస్తూ ఎన్నో అవమానాలు పడుతుంటాడు. కొడుకుని ఎస్సైని చేయాలని తండ్రి కలలు కంటాడు. కాని అర్జున్‌కు అది అసలు ఇష్టం ఉండదు. అయితే అనుకోకుండా పరీక్ష రాసిన అర్జున్.. ఎస్సై అయిపోతాడు. ఈ క్రమంలో హోమంత్రి కంఠం బైరెడ్డి(పవన్‌), అర్జున్‌ మధ్య గొడవ జరుగుతుంది. బైరెడ్డి చేసిన స్కామ్‌ ఏంటి?. అర్జున్‌ దాన్ని ఎలా బయటపెడతాడు? అనేది అసలు కథ. అది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి చూడాల్సిందే..

    ఎవరెలా చేశారంటే:

    మీటర్‌ సినిమాలో కిరణ్‌ అబ్బవరం మాస్‌ హీరోగా అదరగొట్టాడు. గత సినిమాల్లో కంటే ఎంతో ఉత్సాహాంగా నటించి అలరించాడు. ప్రతీ సీన్‌లో తన మార్క్‌ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. తన పంచులు, ప్రాసలతో ఆడియన్స్‌ మెప్పించాడు. కిరణ్‌ చెప్పిన డైలాగ్స్‌ థియేటర్లలో చాలా అద్భుతంగా పేలాయి. హీరోయిన్‌గా అతుల్య రవి పాటల మేరకే పరిమితం అయ్యింది. సప్తగిరి కామెడి అక్కడక్కడ నవ్వులు పూయిస్తుంది. పోసాని కృష్ణమురళి సహా ఇతర నటులు తమ పరిధిమేరకు నటించారు.

    విశ్లేషణ

    సినిమాలో చాలా పాత్రలు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. ఖాళీగా తిరిగే హీరో ఒక్కసారిగా ఎస్సై అవ్వడం వాస్తవ దూరంగా ఉంటుంది. అబ్బాయిలంటేనే ఇష్టపడని హీరోయిన్‌ ఒక్క పాటతో హీరో ప్రేమలో పడిపోవడం ఆడియన్స్‌కు అంతగా రుచించదు. సీఎంను కూడా భయపెట్టేంత రేంజ్‌లో విలన్‌ను చూపించి హీరో ముందు మరీ తక్కువ చేయడం అర్థంకాని అంశంగా ఉంది. సినిమా కథలో కొత్త దనం లేకపోవడంతో పాటు, కొన్ని సీన్లను ఎక్కడో చూశామన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక సాయికార్తిక్‌ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్యం సంగీతం కూడా నార్మల్‌గానే ఉంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • హీరో నటన
    • కామెడీ సన్నివేశాలు

    మైనస్‌ పాయింట్స్‌

    • రొటీన్‌ స్టోరీ
    • సహజత్వం లోపించడం
    • కథలో సాగదీత
    • సంగీతం

    రేటింగ్‌: 2/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv