టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్ సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యాడు. సుకుమార్ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సుకుమార్ ఆసిస్టెంట్ డైరెక్టర్లు:
శ్రీకాంత్ ఓదెల(srikanth odela)
టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు. శ్రీకాంత్ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్ చెప్పారంటే ఈ డైరెక్టర్ టాలెంట్ అర్థమవుతోంది.
బుచ్చిబాబు(Buchi Babu Sana)
సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తారని స్వయంగా చరణ్ చెప్పే స్థాయికి ఎదిగాడు.
పల్నాటి సూర్యప్రతాప్(Palnati surya pratap)
సుకుమార్ డైరెక్షన్ స్కూల్ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ జంటగా ‘18 పేజెస్’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కాగా, సుకుమార్ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్ రైటర్‌గా పనిచేశాడు.
రాజమౌళి ఆసిస్టెంట్ డైరెక్టర్లు: (Rajamouli assistant directors)
G.R కృష్ణ( GR KRISHNA )
టాలీవుడ్ డైరెక్టర్ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు.
కరుణ కుమార్ ( KARUNA KUMAR)
మరో టాలీవుడ్ డైరెక్టర్ కరుణ కుమార్ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.
అశ్విన్ గంగరాజు (ASHWIN GANGA RAJU)
డైరెక్టర్ అశ్విన్ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..!
రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జూ. NTR
రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
ప్రభాస్
2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.
ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్ రేంజ్ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
రామ్‌చరణ్
‘ఆర్‌ఆర్‌ఆర్’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్ తీసిన ఆరెంజ్ సినిమా దారుణంగా విఫలమైంది.
రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్