• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hanuman Movie OTT: హనుమాన్‌ ఓటీటీ ఆలస్యంపై డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ క్లారిటీ.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌!

    యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja), అమృత అయ్యర్ (Amritha Aiyer) జంటగా నటించిన తొలి తెలుగు సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’ (Hanu Man). ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) డైరెక్షన్‌లో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం.. బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఆశ్చర్యపరుస్తోంది. అయితే సంక్రాంతికి రిలీజైన చిత్రాలన్నీ ఇప్పటికే ఓటీటీలో విడుదలై సందడి చేస్తున్నాయి. దీంతో హనుమాన్‌ రాక ఎప్పుడంటూ ఓటీటీ ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. మార్చి 16న హనుమాన్‌ హిందీ వెర్షన్‌ విడుదలవుతున్నప్పటికీ తెలుగులో ఎప్పుడు వస్తుందో తెలియక ఆడియన్స్ తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ సినిమాపై ఓ అపడేట్‌ ఇచ్చాడు. 

    డైరెక్టర్ ఏమన్నారంటే!

    హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌ ఆలస్యంపై సినిమా లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించాడు. ‘హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా చేయలేదు. సినిమాను వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకువచ్చేందుకు మేము అహర్నిశలు కొన్ని విషయాల పట్ల దృష్టి సారించాం. ఎప్పుడూ మీకు మంచి బెస్ట్ కంటెంట్ ఇవ్వడమే మా ఉద్దేశం తప్పా ఇంకేం లేదు. దయచేసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించి మాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. ధన్యవాదాలు’ అని ఎక్స్‌ (ట్విట్టర్‌)లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 

    తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌!

    హనుమాన్‌ సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’ (Zee 5) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ పక్క హిందీలో స్ట్రీమింగ్‌ డేట్‌ కన్ఫార్మ్‌ కాగా తెలుగు ఆడియన్స్‌కు మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ‘జీ 5’ కూడా తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌పై ఆసక్తికర ట్వీట్ పెట్టింది. ‘ఎంతోకాలం ఎదురుచూసిన క్షణం ఆసన్నమైంది. జీ5లో ఇంగ్లీష్ సబ్‌ టైటిల్స్‌తో హనుమాన్ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి’ అంటూ రాసుకొచ్చింది. డైరెక్టర్‌తో పాటు ఓటీటీ సంస్థ కూడా స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రకటించకపోవడంతో ఆడియన్స్ మరింత నిరాశ చెందుతున్నారు. ఇంకెన్ని రోజులు ఈ ఎదురు చూపులు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే హనుమాన్‌ రేపే హిందీతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముందని టాక్‌ వినిపిస్తోంది. 

    హిందీలో డబుల్‌ ధమాకా

    ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’ (Jio Cinema)లో మార్చి 16 నుంచి ఈ సినిమా హిందీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఇటీవల ట్వీట్‌ రూపంలో ప్రకటించాడు. ఇక అదే రోజూ టెలివిజన్‌ ప్రీమియర్‌గానూ హనుమాన్‌ రానుంది. మార్చి 16 రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ (Colors Cineplex) ఛానల్‌లో హనుమాన్‌ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మతో పాటు ‘కలర్స్‌ సినీప్లెక్స్‌’ సంస్థ తమ సోషల్‌ మీడియా ఎక్స్‌ ఖాతాలో ధ్రువీకరించింది. దీంతో హిందీ ప్రేక్షకులు.. హనుమాన్‌ను ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv