హైదరాబాద్లో పలుచోట్ల వర్షం దంచి కొడుతోంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, సికింద్రాబాద్, నారాయణ గూడలో వాన కురిసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు పొలాల వద్ద చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది.
హైదరాబాద్లోని ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, రామాంతపూర్, అంబర్పేట్, మలక్ పేట ప్రాంతాల్లోనూ భారీగా వర్షం పడింది. వనస్థలిపూరం, సైదాబాద్, నల్లకుంట, ఓయూ పరిసరాల ప్రాంతాల్లో వాన కురవగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కూడ పడింది. ఇందుకు సంబంధించిన వీడియోలను నగరవాసులు సోషల్ మీడియాలో పెడుతున్నారు.
భారీ వర్షం కారణంగా పలుప్రాంతాల్లోని రోడ్లు జలమయంగా మారాయి. రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీటితో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సికింద్రాబాద్ పరిసరాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఎంజీ రోడ్ ప్రాంతంలో వాన పడుతున్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశాడు.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?