• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hyderabad Rains: వడగండ్ల బీభత్సం… తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ!

    హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచి కొడుతోంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, సికింద్రాబాద్, నారాయణ గూడలో వాన కురిసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు పొలాల వద్ద చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌, నాగోల్‌, ఎల్బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, రామాంతపూర్‌, అంబర్‌పేట్‌, మలక్‌ … Read more

    హైదరాబాద్‌లో మరిన్ని ప్లైఓర్లు నిర్మిస్తాం: కేటీఆర్

    హైదరాబాద్‌లో మెట్రోలైన్‌ను భవిష్యత్తులో హయత్ నగర్‌ వరకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే మెట్రో లైన్‌ను ఎయిర్‌పోర్టు వరకూ కలిపే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. SRDPలో భాగంగా రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్‌ RHS ఫ్లైఓవర్‌ను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్లైఓవర్లు నిర్మిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

    ‘ఎల్బీనగర్‌ ఫ్లైఓవర్‌కు శ్రీకాంతాచారి పేరు’

    హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాగా 760 మీటర్ల పొడవుతో.. 12 వెడల్పుతో రూ.32 కోట్లు వెచ్చించి ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. చింతల్‌కుంట నుంచి మాల్ మైసమ్మ వరకు ఈ వారధి నిర్మించారు. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలు ఇకపై సిగ్నల్ ఫ్రీగా వెళ్లవచ్చు. నాలుగు దిక్కుల నుంచి వచ్చే వాహనాలు ఆగకుండా నేరుగా వెళ్లవచ్చు.