• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kriti Kharbanda: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న రామ్‌ చరణ్ అక్క… అబ్బాయి ఎవరంటే?

    ‘బ్రూస్‌లీ’ సినిమాలో రామ్‌చరణ్‌ సోదరిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన కృతి కర్బందా (Kriti Kharbanda) ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. అనూహ్యంగా ఓ బాలీవుడ్‌ నటుడుతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని వార్తల్లో నిలిచింది. 

    మెగా హీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈ భామ.. గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయింది.

    తాజాగా ఈ భామ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు బయటకు రావడంతో ఒక్కసారిగా కృతి కర్బందా పేరు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

    బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ సామ్రాట్‌తో (Pulkit Samrat) ఆమె ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు వైరల్‌ అవుతున్న ఫొటోలను బట్టి తెలుస్తోంది. గత కొంత కాలం నుంచి వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. 

    కృతి-పులకిత్‌ జంట (Pulkit Samrat and Kriti Kharbanda) నిశ్చితార్థం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

    ఈ జంట ఫొటోలను చూసిన నెటిజన్లు.. ఈ జోడీ (Kriti Kharbanda Engagement) బాగుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. పెళ్లిరోజు ఎప్పుడో చెప్పాలంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా, వచ్చే నెలలో వీరి పెళ్లి ఉండవచ్చని సమాచారం. 

    అయితే కృతి – పులకిత్‌ రిలేషన్‌షిప్‌ గురించి నాలుగేళ్ల క్రితమే వార్తలు వచ్చాయి. వారు చాలా దగ్గరైనట్లు డేటింగ్‌ కూడా చేస్తున్నట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆ రూమర్లకు నిశ్చితార్థంతో ఈ జంట ఫుల్‌స్టాప్‌ పెట్టింది. 

    దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా (Pulkit Samrat and Kriti Kharbanda).. ‘బోణీ’ (Boni Movie) అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. 

    ఆ తర్వాత టాలీవుడ్‌లోనే ‘తీన్‌మార్’ (Teenmar), ‘అలా మొదలైంది’ (Ala Modalaindi), మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర చిత్రాలు చేసింది. 

    చివరగా 2015లో వచ్చిన ‘బ్రూస్ లీ’ (Bruce lee) మూవీలో రామ్ చరణ్‌ (Ram Charan)కి అక్కగా నటించింది. ఇందులో ఆమెన నటనకు మంచి మార్కులే పడ్డాయి.

    ముఖ్యంగా రామ్‌చరణ్‌ – కృతి కర్బందా మధ్య (Ram Charan Sister) వచ్చే సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. అక్కా-తమ్ముడిగా వీరిద్దరు జీవించారని చెప్పవచ్చు. వీళ్ల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా చాలా సహజసిద్ధంగా అనిపించాయి.

    ఇక గ్లామర్ పరంగా సూపర్ ఉన్నప్పటికీ ఈమెకు (Kriti Kharbanda Engagement) తెలుగులో ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీపై ఆమె పూర్తి ఫోకస్ పెట్టింది.

    అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీ (Bollywood)లోనే సినిమాలు చేస్తూ కాస్తంత బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నటుడు పులకిత్‌ సామ్రాట్‌తో ప్రేమలో పడటం గమనార్హం.

    హిందీలో 2016-17 సంవత్సరాల్లో వరుసగా ‘రాజ్‌: రీబూట్‌’ (Raaz: Reboot), గెస్ట్‌ ఇన్‌ లండన్‌ (Guest iin London), షాది మీన్‌ జరూర్‌ ఆనా (Shaadi Mein Zaroor Aana)చిత్రాలు చేసింది. 

    2018-19లో ‘వీరేకి వెడ్డింగ్‌’, ‘యమ్లా పగ్లా దీవానా: పిర్‌ సే’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘పాగల్‌పంతి’ చిత్రాల్లో మెరిసింది. 

    ఆ తర్వాత ‘తైష్‌’, ‘14 ఫిరే’ సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో మంచి నటిగా (Kriti Kharbanda Engagement) తన ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తద్వారా హిందీలో ప్రముఖ హీరోయిన్ల సరసన స్థానం సంపాదించింది. 

    ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘రిస్కీ రోమియో’ అనే చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా సన్నీ సింగ్‌ (Sunny Singh) నటిస్తున్నాడు. అతడు ఆదిపురుష్‌ చిత్రంలో లక్ష్మణుడి పాత్ర పోషించడం గమనార్హం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv