మనిషి జీవితంలో సంతానం అనేది చాలా ముఖ్య ఘట్టం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. తమ పిల్లల ద్వారా వారసత్వాని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంటారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతమేమి కాదు. అయితే సెలబ్రిటీల పిల్లలు అనగానే సహజంగానే ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం ఉంటుంది. తమ అభిమాన హీరోల వారసులుగా ఆ చిన్నారులను కూడా ఫ్యాన్స్ అభిమానిస్తుంటారు. అయితే సెలబ్రిటీలు తమ పిల్లలకు పెట్టే కొత్త తరహా పేర్ల విషయంలో ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాటి అర్థం తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల పిల్లలు (Tollywood Celebrity Baby Names), వారి పేర్లకు అర్థాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
Contents
- 1 రామ్ చరణ్ (Ram Charan)
- 2 జూ. ఎన్టీఆర్ (Jr NTR)
- 3 అల్లు అర్జున్ (Allu Arjun)
- 4 నాని (Nani)
- 5 నితిన్ (Nithiin)
- 6 మంచు మనోజ్ (Manchu Manoj)
- 7 నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth)
- 8 సుహాస్ (Suhas)
- 9 రణ్వీర్ – దీపికా (Ranveer Singh – Deepika Padukone)
- 10 రణ్‌బీర్ – అలియా (Ranbir Kapoor – Alia Bhatt)
- 11 విరాట్ – అనుష్క (Virat Kohli – Anushka Sharma)
- 12 యామి గౌతమ్ (Yami Gautam)
- 13 అమలా పాల్ (Amala Paul)
రామ్ చరణ్ (Ram Charan)
మెగా ఫ్యామిలీలోకి గతేడాది జూన్‌లో బుల్లి ప్రిన్సెస్ అడుగుపెట్టింది. రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తమకు పుట్టిన గారాల పట్టికి ‘క్లింకారా’ అనే పేరు పెట్టారు. క్లింకారా అంటే ప్రకృతికి ప్రతిబింబం అని అర్థం. అలాగే అమ్మవారి శక్తి రూపానికి ప్రతీకగా కూడా భావిస్తుంటారు. ఈ గుణాలను పోగుచేసుకొని క్లీంకారా ఎదగాలని మెగా ఫ్యామిలీ ఈ పేరు పెట్టింది.
జూ. ఎన్టీఆర్ (Jr NTR)
టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్‌కు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. తారక్ – ప్రణీత దంపతులు తమ మెుదటి సంతానానికి అభయ్ రామ్ అనే పెట్టారు. రెండో కుమారుడికి భార్గవ్ రామ్ అని నామకరణం చేశారు. హరికృష్ణ తన కొడుకులకి జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్(ఎన్టీఆర్) అని చివర్లో రామ్ వచ్చేలా పెట్టుకున్నారు. అదే సంప్రదాయాన్ని తారక్ కూడా కొనసాగించడం విశేషం. అభయ్ అంటే భయం ఎరుగని వాడు అని అర్థం. ఇక భార్గవ్ రామ్ అంటే శ్రీరాముడు అనేక నామాల్లో ఇదీ ఒకటి.
అల్లు అర్జున్ (Allu Arjun)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. మగబిడ్డకు అల్లు అయాన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పుట్టిన ఆడపిల్లకు అల్లు అర్హా అని నామకరణం చేశారు. అయాన్ అంటే దివ్యమైనది (సంస్కృతి), దేవుని బహుమతి (అరబిక్), గుర్తుపెట్టుకోవాల్సింది (పర్షియన్) అని అర్థం. అలాగే అర్హా అంటే ‘శివం’ అని మీనింగ్ వస్తుంది. ఇస్లామిక్ అర్థాన్ని తీసుకుంటే ప్రశాంతమైన, నిర్మలమైన అని సూచిస్తుందట.
నాని (Nani)
నేచురల్ స్టార్ నాని దంపతులకు ఓ బాబు ఉన్నాడు. పేరు అర్జున్. ముద్దుగా జున్ను అని పిలుచుకుంటారు. అర్జున్ అంటే సంస్కృతం నుంచి వచ్చిన హిందూ పేరు. పాండవుల్లో ఒకరైన అర్జునుడు గొప్ప వీరుడిగా గుర్తింపు పొందాడు.
నితిన్ (Nithiin)
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నితీన్ (Tollywood Celebrity Baby Names) ఈ ఏడాదే కొత్తగా తండ్రయ్యాడు. వినాయక చవితికి ఒక రోజు ముందు ఆయన భార్య షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడి పేరును నితిన్ ఎక్కడా రివీల్ చేయలేదు.
మంచు మనోజ్ (Manchu Manoj)
నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు దేవసేన శోభాగా నామకరణం చేశారు. దేవసేన అంటే హిందూ దేవత. దేవతల సైన్యాధిపతిగా పురణాల్లో ఆ పేరును ప్రస్తావించారు. కాగా, ఇరుకుటుంబాల అంగీకారంతో గతేడాది మనోజ్ – మౌనిక వివాహం జరిగింది. మౌనికకు అప్పటికే మెుదటి ద్వారా జన్మించిన కుమారుడు ఉన్నాడు.
నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth)
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Tollywood Celebrity Baby Names) ఈ ఏడాదే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడికి ధీరా సిద్ధార్థ్ అని పేరు పెట్టారు. ధీర అంటే గొప్ప వీరుడు అని అర్థం.
సుహాస్ (Suhas)
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కూడా ఈ ఏడాదే తండ్రయ్యాడు. అతడి భార్య లలిత జనవరిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తనకు పుట్టిన బిడ్డకు తాను పేరు పెట్టనని సుహాస్ గతంలో తెలిపారు. తన హీరోగా చేసిన ‘కలర్ ఫొటో’ డైరెక్టర్‌కు పేరు పెట్టే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. మరి ఏ పేరు పెట్టారో సుహాస్ అనౌన్స్ చేయలేదు.
రణ్వీర్ – దీపికా (Ranveer Singh – Deepika Padukone)
బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. సెప్టెంబర్‌లో దీపికా ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పాపకు దువా పదుకొణే సింగ్ అని పేరు పెట్టారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. తమ ప్రార్థనలకు సమాధానమే ఈమె అంటూ దీపికా నవంబర్ 2న స్పెషల్ పోస్టు పెట్టింది.
రణ్‌బీర్ – అలియా (Ranbir Kapoor – Alia Bhatt)
బాలీవుడ్ బెస్ట్ కపుల్ రణ్‌బీర్ ఆలియా భట్ 2022లో పేరెంట్స్ అయ్యారు. ఓ కూతురుకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు రాహా అనే పేరు పెట్టారు. రాహా అంటే పీస్ఫుల్, హ్యాపీనెస్ ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
విరాట్ – అనుష్క (Virat Kohli – Anushka Sharma)
భారత స్టార్ కపుల్ విరాట్-అనుష్కలు ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తమ మగ బిడ్డకు ‘అకాయ్’ అనే పేరు పెట్టారు. అకాయ్ అంటే సంస్కృతంలో నిరాకారమని, రూపం లేనిదని అర్థం. టర్కీ భాషలో మెరుస్తున్న చంద్రుడు అని కూడా అంటారు. ఇక తమ మెుదటి కుమార్తెకు దుర్గాదేవి పేరు వచ్చేలా ‘వామిక’ అని విరుష్క దంపతులు పేరు పెట్టారు.
యామి గౌతమ్ (Yami Gautam)
బాలీవుడ్ నటి యామి గౌతమ్ (Tollywood Celebrity Baby Names) ఈ ఏ
డాది మేలో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. యామి – ఆదిత్య ధర్ దంపతులు తమ బిడ్డకు వేదవిద్ అని పేరు పెట్టారు. వేదవిద్ అంటే వేదాలు బాగా తెలిసినవాడు అని అర్థం.
అమలా పాల్ (Amala Paul)
తమిళ స్టార్ నటి అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. అమలాపాల్ – జగత్ దేశాయ్ దంపతులు జూన్‌లో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. అతడికి ఇలాయ్ అని పేరు పెట్టారు. తమిళంలో ఇలాయ్ అంటే ఆకు (Leaf) అని అర్థం. హీబ్రూలో లాంగ్వేజ్‌లో ఆరోహణ అని కూడా అర్థం వస్తుంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ