సూపర్ స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. ‘RRR‘ వంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ‘SSMB29‘ భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాపై ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన రానప్పటికీ గాసిప్స్ మాత్రం పెద్ద ఎత్తునే చక్కర్లు కొట్టాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్, బియర్డ్ లుక్‌తో మేకోవర్ అవుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం ఇటీవల కాలంలో చాలా సార్లు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ లేటెస్ట్ లుక్స్ మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. గత ఫొటోలతో పోలిస్తే కాస్త భిన్నంగా మహేష్ కనిపించడం విశేషం.
మహేష్ లుక్ అదుర్స్!
భారత్‌కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ మాల్దీవుల్లో ఇచ్చిన విందుకి ఇటీవల మహేష్ బాబు దంపతులు హాజరయ్యారు. వారితో పాటు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), విక్టరి వెంకటేష్ (Venkatesh), అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. వీరంతా ఓ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని దిగిన ఒక ఫొటో సైతం ఇటీవల వైరల్ అయ్యింది. అయితే ఈ ఈవెంట్‌లో మహేష్ దిగిన ఫొటోలు తాజాగా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. పార్టీ ఇచ్చిన బిజినెస్ మ్యాన్ కపుల్స్‌తో మహేష్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో మహేష్ లుక్ అదిరిపోయింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మార్పులు గమనించారా?
రాజమౌళి దర్శకత్వంలో రానున్న ‘SSMB 29’ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం మహేష్ బాబు మేకోవర్ అవుతున్నారు. అయితే గతంలో వైరల్ అయిన ఫొటోలకు ప్రస్తుత మేకోవర్‌కు కాస్త డిఫరెన్స్ కనిపిస్తోంది. గత పిక్స్‌లో మహేష్ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. లేటెస్ట్ పిక్స్‌లో మాత్రం అతడి హెయిర్ కాస్త షార్ట్ అయ్యింది. అలాగే గడ్డాన్ని కూడా ట్రిమ్ చేశాడు. పూర్తిగా ఉంగరాల జుట్టుతో కనిపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ మహేష్ లుక్ ఫైనల్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాలో మహేష్ ఈ లుక్‌తోనే కనిపిస్తాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వారణాసి నేపథ్యంలో..
రాజమౌళి – మహేష్ బాబు (SSMB29) చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ వారణాసి నేపథ్యంలో మెుదలవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సౌతాఫ్రికాకు షిఫ్ట్ అవుతుందని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వారణాసి షెడ్యూల్ మెుత్తాన్ని ఓ సెట్‌లో పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారట. దాని కోసం హైదరాబాద్ శివార్లలో భారీ కాశీ సెట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కథ మెుత్తం అటవీ నేపథ్యంలో సాగనుండటంతో అందుకు అనువైన ప్రదేశాన్ని జక్కన్న టీమ్ రెక్కీ చేస్తున్నట్లు సమాచారం. లోకేషన్ ఫైనల్ కాగానే సెట్ నిర్మాణ పనులను మెుదలుపెడతారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
హీరోయిన్‌గా బ్రిటిష్ భామ!
SSMB 29 ప్రాజెక్టులో సూపర్ స్టార్ మహేష్‌కు జోడీగా బ్రిటిష్ భామ కనిపించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. RRR సినిమాలో బ్రిటీష్ భామ ఓలివియా మోరిస్ (Olivia Morris)ను తీసుకున్న రాజమౌళి మహేష్ బాబుతో సినిమా కోసం మరో బ్రిటీష్ ముద్దుగుమ్మ నవోమి స్కాట్ (Naomi Scott)ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని అంటున్నారు. కాగా నవోమి స్కాట్‌కు భారత్ మూలాలు ఉన్నాయి. ఆమె తల్లి ఉసా స్కాట్‌ది గుజరాత్ కాగా ఆమె చిన్నప్పుడే ఇంగ్లాండ్‌కు వలస వెళ్లారట. కాబట్టి భారత్‌పై నవోమి స్కాట్‌కు కాస్త అవగాహన ఉన్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్‌లో వచ్చిన ‘చార్లీస్ ఏంజెల్స్’, ‘స్మైల్’, ‘అల్లాద్దీన్’, ‘విజర్డ్స్’ తదితర చిత్రాల్లో నవోమి నటించింది.
రూ.2000 కోట్లకు పైగా బిజినెస్!
మహేశ్-రాజమౌళి కాంబోలో రానున్న SSMB 29 గురించి టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ బడ్జెట్ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటుతుందని అంచనా వేశారు. ‘అంతర్జాతీయ నటులు ఈ చిత్రంలో నటించనున్నారు. దీని బిజినెస్ మినిమం రూ.2000కోట్లు దాటొచ్చని టీమ్ భావిస్తోంది. అంతకుమించి ఎంతైనా వసూలు చేయొచ్చు. ఈ నంబర్ రూ.3, 4 వేల కోట్ల వరకు వెళ్లొచ్చు. అదే జరిగితే తెలుగు సినిమాలోనే కాదు భారతదేశ సినీరంగంలోనే కొత్త చరిత్ర అవుతుంది. భవిష్యత్తును రాజమౌళి బాగా ఊహిస్తారు. ఆయన ఈ చిత్రంతో మళ్లీ మరోసారి సత్తా చాటనున్నారు’ అని అన్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం