• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Pawan Kalyan Movies Update: పెండింగ్‌ మూవీస్‌పై పవన్‌ కల్యాణ్‌ ఫోకస్‌.. ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌! 

  ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పేరు.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్ట్రైక్‌ రేట్‌ (21/21 ఎమ్మెల్యేలు, 2/2 ఎంపీలు)తో జనసేన సాధించిన సీట్లు.. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాయి. అయితే గత పదేళ్లుగా రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ వచ్చిన పవన్‌.. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. దీంతో అప్పటివరకూ శరవేగంగా షూటింగ్‌ జరుపుకున్న ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాత్‌ భగత్‌సింగ్‌’ చిత్రాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే ఏపీ ఎన్నికలు ముగియడం, పవన్‌ ఉపముఖ్యమంత్రి కూడా కావడంతో.. పెండింగ్‌లో ఉన్న సినిమాలపై పవన్ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. 

  త్వరలోనే షూటింగ్ ప్రారంభం

  పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చేతిలో ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh), ‘ఓజీ’ (OG), ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రాల షూటింగ్‌ చాలా వరకూ పూర్తయ్యింది. ఇక పవన్‌ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు చిత్రాల కోసం పవన్‌.. తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే చిత్ర నిర్మాతలను కలిసి, తన కాల్‌షీట్ల గురించే చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తన మూడు చిత్రాల కోసం రెండు నెలల సమయాన్ని కేటాయించి.. ఆ తర్వాత నుంచి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాలని పవన్‌ యోచిస్తున్నట్లు సమాచారం.

  ‘పవన్‌.. గొడవలు పెట్టేవారు’

  మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మించిన ‘పరువు’ (Paruvu) వెబ్‌సిరీస్‌.. జీ5 వేదికగా సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్యూలో సుస్మిత.. తన బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా చిన్నతనంలో నాకూ చరణ్‌కు గొడవలు వచ్చేవి. అందుకు కారణం మా పవన్‌ బాబాయ్‌. ఆయన ఇద్దరికీ గొడవలు పెట్టి సినిమా చూసినట్లు చూసేవారు. అది చాలా సరదాగా ఉండేది. ఆయన మాతో ఎప్పుడూ సరదాగా ఉండేవారు. ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్‌ కావడం మాకు సంతోషంగా ఉంది. ఆయన ప్రజల మనిషి.. వారి కోసం ఏదైనా చేస్తారు’ అని మెగా డాటర్‌ చెప్పుకొచ్చారు. 

  మామకు స్పెషల్‌ గిఫ్ట్‌

  ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ఆయన మేనల్లుడు, మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నాకు స్టార్‌వార్స్‌ లెగోను పరిచయం చేసింది మామయ్యే. ఆయనలోని పిల్లాడికి దాన్ని గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు శనివారం (జూన్‌ 15) రోజున తిరుమలకు కాలినడకన వెళ్లిన సాయిధరమ్‌ తేజ్‌.. తన మామయ్య విజయాన్ని పురస్కరించుకొని శ్రీవారికి మెుక్కులు చెల్లించుకున్నారు. కాగా, మామ – అల్లుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv