ఈడీ విచారణకు వ్యతిరేకంగా కవిత దాఖలు చేసిన పిటిషన్పై 24న విచారణ జరగాల్సి ఉన్నా… వాయిదా పడే అవకాశం ఉంది. సర్వోన్నత న్యాయస్థానం బిజీ షెడ్యూల్ కారణంగా మారుతుందని తెలుస్తోంది. మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 15న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్ను ప్రస్తావించారు. త్వరగా విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. మార్చి 24న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తెలిపారు. అయితే తాజాగా జాబితాలో విచారణ మార్చి 27న చేపట్టే అవకాశం ఉన్నట్టుగా వెల్లడించారు.
మద్యం కుంభకోణం కేసులో కవిత పాత్రపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆమెను నాలుగుసార్లు విచారించారు. తొలిరోజు సుదీర్ఘంగా ప్రశ్నించగా… రెండోసారి ఆమె వెళ్లలేదు. తనను వ్యక్తిగతంగా రమ్మని పిలువలేదనే కారణంతో ఆమె తరఫు న్యాయవాదికి ఈడీ అడిగిన పత్రాలను ఇచ్చి పంపించారు. అదే సమయంలో తనను ఇంటివద్దే ప్రశ్నించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఈడీకీ వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ వెంటనే వ్యక్తిగతంగా రమ్మని ఈడీ నోటీసులు ఇచ్చింది.
మూడోసారి విచారణకు హాజరైన ఆమెను ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైతో కలిపి విచారించినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే మళ్లీ ఆమె సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు. కవిత 10 ఫోన్లు పగలగొట్టినట్లుగా అనుమానించడంతో అందుకు సంబంధించిన ఆధారాలను ఆమె సమర్పించారు. 10 ఫోన్లకు ఈఎంఐ నంబర్లు అంటించి తీసుకెళ్లారు.
సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేయనున్న పిటిషన్ విచారించి ధర్మాసనం ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?