వాగులో దూకిన నిందితుడు; పోలీసుల నుంచి తప్పించుకుని?
పోలీసు జీపులోంచి ఓ నిందితుడు వాగులో దూకి పరారయ్యాడు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా సంగంలో చోటుచేసుకుంది. ఓ దొంగతనం కేసులో ఎ.గిరి అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఏఎస్ పేట నుంచి నెల్లూరు తరలిస్తుండగా బీరాపేరు వాగు పెన్నా నదిలో కలిసే చోట వాహనంలోంచి కిందికి దూకాడు. వెంటనే బీరాపేరు వాగులోకి దూకి పారిపోయాడు. కానీ ఇంతవరకు అతడి ఆచూకీ దొరకలేదు. పరారయ్యాడా..నీటిలో మునిగి చనిపోయాడా అనేది తేలలేదు.