• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇండో అమెరికన్లుకు శుభవార్త

    అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు అధ్యక్షుడు జో బైడెన్‌ శుభవార్త చెప్పారు. హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ ఎలాంటి ఉద్యోగాలైనా చేసేందుకు అనుమతించారు. ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌–ఈఏడీ గడువు కాలాన్ని ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త నిబంధనలు ఈఏడీల కోసం అప్లయ్‌ చేసుకునే వారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

    హమాస్‌ దాడిలో 9 మంది మృతి

    ఇజ్రాయెల్‌లో హమాస్‌ జరిపిన దాడిలో తొమ్మిది మంది అమెరికాన్లు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది మంది అమెరికన్‌ పౌరుల ఆచూకీ తెలియకుండా పోయిందని అమెరికా వెల్లడించింది. తొలుత నలుగురు చనిపోయినట్లు పేర్కొనగా.. తాజాగా ఆ సంఖ్య తొమ్మిదికి చేరిందని అమెరికా ప్రకటించింది. అయితే, ఆచూకీ తెలియని వారు బందీలుగా ఉన్నారా..? చనిపోయారా..? అన్నది స్పష్టత లేదని వాషింగ్టన్‌ వెల్లడించింది.

    కేర్‌టేకర్‌కు 690 ఏళ్లు జైలు శిక్ష

    చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో ఓ వ్యక్తికి 690 ఏళ్లు జైలు శిక్ష పడింది. నిందితుడు బేబీ కేర్‌టేకర్‌గా పనిచేస్తూ చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. వారిని శారీరక వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం బయటపడటంతో అతడికి న్యాయస్థానం 690 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలో జరిగింది. మథ్యూ జక్ర్‌జేవ్‌స్కీ (34) బాలుర కేర్‌టేకర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎంతో మంది చిన్నారులను వేధించాడు.

    ఆకలితో అలమటిస్తున్న యువతి

    మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. విషయం తెలుసుకున్న ఆమె తల్లి భారత్‌కు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌కు లేఖ రాసింది. మిన్హాజ్ జైదీ మాస్టర్స్ చేసేందుకు 2021లో అమెరికా వెళ్లింది. వస్తువులు ఎవరో దొంగిలించడంతో ఆమె చికాగో రోడ్లపై ఆకలి కడుపుతో తిరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు జైదీని గుర్తించి తల్లికి సమాచారం అందించారు. దీంతో తన కుమార్తెను భారత్‌కు రప్పించేందుకు ఆమె తల్లి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. Syeda … Read more

    ఫ్లైయింగ్ బైక్ వచ్చేసింది!

    గాల్లో ఎగిరే బైక్ వచ్చేసింది. అమెరికాకు చెందిన ఒక టెక్నాలజీ సంస్థ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హోవర్ బైక్. ఈ హోవర్ బైక్ గంటకు100 కి.మీ వేగంతో 40 నిమిషాల పాటు గాల్లో ఎగరగలదు. దీనిపై ఒకరు మాత్రమే ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది నాటికి ఇది మార్కెట్‌లోకి రానుంది. దీని ధర రూ.6 కోట్లు ఉంటుందని అంచనా. వీడియో కోసం వాచ్ ఆన్ బటన్‌పై క్లిక్ చేయండి. This is the world's first flying bike. … Read more