రాహుల్ జోడోయాత్రలో విషాధం… సంతోఖ్ సింగ్ మృతి
కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ మంత్రి సంతోఖ్ సింగ్ చౌదరి గుండె పోటుతో మరణించారు. పంజాబ్లోని లూథియానాలో రాహుల్ గాంధీతో కలిసి ఆయన జోడో యాత్రలో పాల్గొన్నారు. అకస్మాత్తుగా సంతోఖ్ గుండె వేగం పెరిగి కుప్పకూలారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసిన రాహుల్ గాంధీ ఆస్పత్రికి బయల్దేరారు.