• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటర్ల జాబితాలో మీ పేరుందా?

    ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.. అయితే అందులో మీపేరు ఉందో లేదో పరిశీలించేందుకు ఉన్న మార్గాలివి. ప్రభుత్వ కాల్‌సెంటర్‌కు కాల్‌ చేస్తే వారు లైన్‌లో ఉంచి జాబితాలో పేరు ఉన్నదీ లేనిదీ చెప్తారు. 1950కి కాల్‌ చేస్తే జిల్లాలోని ఎన్నికల విభాగంలోని కాల్‌ సెంటర్‌కు వెళుతుంది. వారికి పేరు, నియోజకవర్గం చెబితే చాలు జాబితాలో పేరు ఉన్నదీ, లేనిదీ తెలుపుతారు. అలాగే ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, బూత్‌ నంబరు కూడా తెలియజేస్తారు.

    రాజస్థాన్‌ పోలింగ్ తేదీలో మార్పు

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీలో పలు మార్పులు చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్‌ 23న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్‌ 25కి మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాల్లో ఎధావిధిగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది. రాజస్థాన్‌లో ఎన్నికల రోజు పెద్ద సంఖ్యలో వివాహాలు/శుభకార్యాలు/ సామాజిక కార్యక్రమాలు ఉండటంతో ప్రజలు ఓటు వేసేందుకు ఇబ్బంది కలుగుతుందని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

    ఓటర్లకు సీఈవో కీలక సూచనలు

    తెలంగాణలో ఎన్నికల కోట్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రత్యేక ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని వెల్లడించింది. ఫిర్యాదుల కోసం 1950ను సంప్రదించాలి ఎన్నికల సంఘం పేర్కొంది.

    TS: ఓటర్ల జాబితా ఇదే!

    తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఓటర్లలో పురుష ఓటర్లు – 1,58,71,493, మహిళా ఓటర్లు – 1,58,43,339, కొత్త ఓటర్ల సంఖ్య – 17.01 లక్షలు, తొలగించిన ఓట్లు – 6.10 లక్షలు, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు – 2,557, ఓటర్లు మొత్తం ఓటర్లు – 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది.

    ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాలి: ఈసీ

    ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరగాలని ఈసీ పేర్కొంది, అర్హులందరికీ ఓటు హక్కు ఉండడంతో పాటు అనర్హులను తీసివేయాలని స్పష్టం చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణలో ఈసీ రెండో రోజు పర్యటనలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్ కమిషనర్లతో సమావేశమైంది. ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేసింది. ఎన్నిలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు ఈసీ స్పష్టం చేసింది.

    TS: ఓటర్ల జాబితా ఇదే!

    తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఓటర్లలో పురుష ఓటర్లు – 1,58,71,493, మహిళా ఓటర్లు – 1,58,43,339, కొత్త ఓటర్ల సంఖ్య – 17.01 లక్షలు, తొలగించిన ఓట్లు – 6.10 లక్షలు, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు – 2,557, ఓటర్లు మొత్తం ఓటర్లు – 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది.

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల్లో బహిరంగ పరచాలని నిర్ణయించింది. తప్పుడు అఫిడవిట్లు, ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వృద్దులు, 40శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు హక్కును కల్పిస్తామని పేర్కొంది. ఇదిలాఉంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల సన్నద్దతపై ఈసీ సమీక్షిస్తోంది.