స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు
బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ధరపై రూ.110 మేర తగ్గింది. తగ్గిన ధరల ప్రకారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,200గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750గా ఉంది. అదే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,050గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,600గా ఉంది. అలాగే వెండి కిలో రూ.70,300గా ఉంది. హైదరాబాద్లో 74,600గా ఉంది.